Begin typing your search above and press return to search.

పిల్ల‌లు ఎందుకంత త్వ‌ర‌గా పెరుగుతారు? - ప్రియాంక గాంధీ స్వీట్ పోస్ట్‌

By:  Tupaki Desk   |   25 Jun 2021 2:00 PM IST
పిల్ల‌లు ఎందుకంత త్వ‌ర‌గా పెరుగుతారు? -  ప్రియాంక గాంధీ స్వీట్ పోస్ట్‌
X
పిల్ల‌ల‌కు జ‌న్మించిన‌ప్పుడు మాతృత్వంతో త‌ల్లి ఎంత‌గా పొంగిపోతుందో.. ఎదుతుగుతున్న త‌న ప్ర‌తిరూపాన్ని చూసుకుంటూ కూడా.. నిత్యం అంతే ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఈ విష‌యంలో ఎలాంటి తార‌త‌మ్యాలు ఉండ‌వు. సెల‌బ్రిటీలు సైతం ఇందుకు మిన‌హాయింపు కాదు. తాజాగా.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ త‌న పిల్ల‌ల ప‌ట్ల ఎంత ప్రేమ‌తో ఉంటారో చెప్పే వీడియో ఒక‌టి పోస్టు చేశారు.

త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఉన్న ఈ వీడియో ఎంతో క్యూట్ గా ఉంది. ఈ వీడియోలో నెల‌లు కూడా నిండ‌ని కూతురితో, సుమారు రెండేళ్లున్న కుమారుడు రెహ‌న్ తో ముచ్చ‌టిస్తున్నారు ప్రియాంక‌. కుమారుడితో క‌బుర్లు చెబుతుండ‌డం.. త‌ల్లిమాట‌లు వింటూ ముద్దుగా ముద్దుగా రిప్లే ఇస్తున్నాడు కొడుకు. మ‌ధ్య తెల్లటి వ‌స్త్రంలో చుట్టిన కూతురు ప‌డుకొని ఉంది.

ఈ వీడియోను ఇప్పుడు పోస్టు చేయ‌డానికి గ‌ల కార‌ణం ఏమంటే.. ఇవాళ త‌న కూతురు మిరాయ పుట్టిన రోజు. మ‌రి, ఆమె వ‌య‌సు ఎంతో తెలుసా? 19 సంవ‌త్స‌రాలు. కూతురు జ‌న్మించిన నాటి వీడియోను పోస్టు చేసిన ప్రియాంక‌.. ‘పిల్ల‌లు ఎందుకంత త్వ‌ర‌గా ఎదిగిపోతారు?’ అంటూ బిడ్డల ఎదుగుదల గురించి పోస్టు పెట్టి, త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఎంతో మందికి ఈ వీడియో న‌చ్చింది. దీంతో.. త‌ల్లీ బిడ్డ‌ల ప్రేమ గురించి త‌మ‌దైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు.