Begin typing your search above and press return to search.
మోడీని మించిన ప్రియాంక గాంధీ.. ఇలా అయితే ఎలా అంటున్న బీజేపీ కేడర్
By: Tupaki Desk | 2 March 2021 11:00 PM ISTరాజకీయం రంగు మారింది. ఇప్పుడు గెలవాలంటే ప్రజల్లోకి రావాల్సిందే.. సామాన్యుల్లో కలిసిపోవాల్సిందే. ఎన్నికల వేళ అయితే ఇంకా చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటాయి. ఇలా ప్రజలను అట్రాక్ట్ చేయడంలో ప్రధాని మోడీని మించిన మొనగాడు మరొకరు లేరు. అందుకే ఊరు పేరు తెలియని వారికి మోడీ లేఖలు రాస్తుంటాడు.. ఫోన్ చేసి మాట్లాడుతాడు.. సామాన్యుల్లో సామాన్యుడిగా తిరిగి వారిలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించాడు.
యువత, ప్రజలను ప్రభావితం చేయాలంటే వారి వద్దకు వెళ్లాలి. మోడీ అదే చేసి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కంటెంట్ లోకానీ.. వేషధారణలో కానీ.. యాక్టింగ్ లో, ఫొటోలు ప్రెజంట్ చేయడంలో మోడీ దిట్ట. ఇక ప్రజలతో కలిసిపోవడంలో మోడీని మించిన వారు లేరు. ఇలా మోడీ చాయ్ వాలాగా సామాన్య ప్రజలకు చేరువయ్యాడు. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు షేర్ చేసుకొని మోడీ సింప్లిసిటీతో మరింత మంది దేశ ప్రజలకు చేరువ అయ్యాడు.
అయితే ఇప్పుడు మోడీ బాటలోనే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నడుస్తున్నారు. రాహుల్ మొన్నటికి మొన్న తమిళనాడులో మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లి ఈతకొట్టాడు. వారితో కలిసి బిర్యానీ వండుకుతిన్నాడు. పాఠశాలల్లో విద్యార్తులతో కలిసి బస్కీలు కొట్టాడు.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు ఉండడంతో యూత్ ను ఆకట్టుకునే పనిలో రాహుల్ పడ్డాడు.
ఇప్పుడు ప్రియాంక వంతు.. తాజాగా ఈశాన్య రాష్ట్రం అసోంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రియాంక తీసుకున్నారు. అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉండి ఓటింగ్ ప్రభావితం చేసే తేయాకు కార్మికులను కలిసి వారిలాగా తట్టాబుట్టా పట్టుకొని తేయాకు కూలీగా మారి ఆకులు ఏరారు. ఈ ఫొటోలు షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి.
రెండు రోజుల నుంచి ప్రియాంక, రాహుల్ గాంధీలు ఇలా సామాన్యుల్లో కలిసి పోయి విపరీతంగా యూత్ ను ఆకర్షిస్తున్నారు. వాళ్ల ప్రవర్తన చూస్తుంటే ఇలా కొనసాగితే రాబోయే రోజుల్లో వృద్ధ జంబూకాలకు స్వస్తి పలికి.. యువతని కాంగ్రెస్ పార్టీలో ఎంకరేజ్ కనుక చేస్తే బీజేపీ పని అయిపోతుందని బీజేపీ కేడర్ అనుకుంటోందంట.. యువత దూరమై కాంగ్రెస్ ఓడిందని.. వారిని రాహుల్, ప్రియాంక లాగేస్తే గెలుపు టర్న్ అవుతుందన్న చర్చ సాగుతోంది.