Begin typing your search above and press return to search.
రాహుల్ తగ్గలేదు.. ప్రియాంక నెగ్గింది..
By: Tupaki Desk | 3 July 2021 8:00 AM ISTరాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే అసలైన రాజకీయ నాయకుడు అంటారు. ఆ రాజకీయాన్ని అక్షరాల వంటపట్టించుకుంది ప్రియాంక గాంధీ. ఈ కాంగ్రెస్ అధినేత్రి సోనియా కూతురు ఇప్పుడు పార్టీలో చూపుతున్న చొరవ, క్రియాశీలత చూసి పార్టీ వర్గాలు ఆశ్చర్యంలో మునిగిపోయాయట..
ఇటీవల పంజాబ్ లోని కాంగ్రెస్ లో లొల్లి ముదిరింది. సీఎం అమరీందర్ ను వ్యతిరేకించి బయటకొచ్చిన క్రికెటర్ , మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ అధిష్టానం వద్దకు వచ్చారు. సీఎం అమరీందర్ పై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ రాగా.. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదట.. కాంగ్రెస్ లోని రెబల్స్ ను ఎప్పుడూ రాహుల్ గాంధీ ఎంకరేజ్ చేయరు. గతంలో మధ్యప్రదేశ్ లో తన ప్రియ శిష్యుడు జ్యోతిరాధిత్యసింధియా నాటి కాంగ్రెస్ సీఎంపై అసమ్మతి రాజేస్తే రాహుల్ ఊరుకోలేదు. తనకు క్లోజ్ ఫ్రెండ్ అయినా పక్కనపెట్టారు. దీంతో సింధియా బీజేపీలోకి చేరిపోయారు. అయినా రాహుల్ మాత్రం దానిపై వెనక్కి తగ్గలేదు.
ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వైదొలిగి సీఎం అమరీందర్ సింగ్ పై తిరుగుబాటు ఎగురవేసిన ప్రముఖ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను సైతం రాహుల్ గాంధీ పక్కనపెట్టారు. పంజాబ్ నుంచి తనను కలిసేందుకు వచ్చినా కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడం విశేషం.
త్వరలోనే పంజాబ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ బీజేపీకి ఆశలు లేకున్నా.. కాంగ్రెస్ లోని అనైక్యత చేటు తెస్తోంది. ఈ క్రమంలోనే సిద్దూ పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి లేవదీశారు. ఢిల్లీకి వచ్చి రాహుల్ అపాయింట్ మెంట్ కోరితే ఇవ్వలేదట... అసమ్మతులపై తాను ఉక్కుపాదమే మోపుతానని సంకేతాలిస్తూ సిద్దూ వ్యతిరేకవర్గంతో రాహుల్ గాంధీ వరుస సమావేశాలు నిర్వహించారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ముఖం చాటేయడంతో ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీని సిద్దూ కలిశాడు. ప్రియాంక గాంధీ చొరవ తీసుకొని సిద్దూతో సమావేశమై శాంతింప చేశారట. అనంతరం స్వయంగా రాహుల్ గాంధీకి ఫోన్ చేసి మరీ సిద్దూతో భేటి కావాలని సూచించిందట..
చెల్లి ప్రియాంక కోరికను కాదనలేక రాహుల్ సైతం వెంటనే సిద్దూకు ఫోన్ చేసి భేటి అయ్యారు. పంజాబ్ లోని అసమ్మతిని చల్లార్చాలని.. కలిసి పనిచేయాలని సూచించాడట.. మొత్తానికి ప్రియాంక గాంధీ చొరవతో కాంగ్రెస్ లో పెద్ద అసమ్మతి కట్టడి అయ్యిందని కాంగ్రెస్ వర్గాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయట..