Begin typing your search above and press return to search.

పేరుకు సీఎం అభ్యర్థి.. కానీ నోటా కంటే తక్కువ ఓట్లు!

By:  Tupaki Desk   |   12 Nov 2020 10:30 AM IST
పేరుకు సీఎం అభ్యర్థి.. కానీ నోటా కంటే తక్కువ ఓట్లు!
X
ఈ సారి బీహార్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఐపీఎల్​ క్రికెట్​ను తలపించాయి. ఎన్​డీఏ.. మహాఘట్​బంధన్​ మధ్య నువ్వా​-నేనా అన్న రేంజ్​లో పోటీ సాగింది. చివరకు జేడీయూ కూటమి విజయం సాధించింది. అయినప్పటికీ ఆర్​జేడీకి కూడా చెప్పుకోదగ్గ స్థానంలో సీట్లు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సుమారు 7 లక్షల మందికి పైగా బీహార్​ ఓటర్లు నోటాకు ఓటేశారు. లండన్​లో స్థిరపడ్డ జేడీయూ సీనియర్​ నేతన వినోద్​ చౌధురి కుమార్తె పుష్పమ్​ ప్రియా చౌదరి (28) బిహార్​ ఎన్నికల ముందు ‘ప్లూరల్స్​’ అనే రాజకీయపార్టీని స్థాపించారు.

బీహార్​ వ్యాప్తంగా ఆమె పార్టీ అభ్యర్థులు పోటీచేశారు. ఎన్నికల ప్రచారంలో ఆకట్టుకొనే ప్రసంగాలు కూడా చేశారు. తమ పార్టీని గెలిపిస్తే.. బీహార్​ను ప్రపంచస్థాయి రాష్ట్రంగా అభివృద్ధి చేస్తానని.. నిరుద్యోగం తొలగిస్తానని.. పనికోసం ఇక్కడి ప్రజలు వలసవెళ్లకుండా రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని ఆమె హామీలు గుప్పించారు. కానీ ప్రియా చౌధురిని బీహార్​ ప్రజలు తిప్పికొట్టారు. కనీసం చెప్పుకోదగ్గ ఓట్లు కూడా రాలేదు. ఆమె పోటీచేసిన స్థానాల్లో సైతం డిపాజిట్​ దక్కించుకోలేకపోయారు. ఓ స్థానంలో అయితే నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి.

ప్రియా తండ్రి వినోద్​ జేడీయూ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నారు. అయినప్పటికీ ఆమె జేడీయూలో చేరకుండా కొత్తపార్టీని స్థాపించి బొక్కబోర్లా పడ్డారు. దర్భంగాకు చెందిన పుష్పమ్​ ప్రియా చౌధురి బిస్ఫీ నియోజకవర్గంలో పోటీచేశారు. అక్కడ ఆమెకు 1521 ఓట్లు రాగా.. నోటాకు 2929 ఓట్లు వచ్చాయి. అలాగే మరో స్థానం బంకీపూర్​లో 5189 ఓట్లు సాధించారు. అక్కడ కూడా నోటాకు 1213 ఓట్లు పడ్దాయి. ఈ రెండు చోట్ల ప్రియా బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు.