Begin typing your search above and press return to search.

ఆ ప్రైవేట్ స్కూల్స్ కి నోటీసులిచ్చిన ఏపీ ప్రభుత్వం!

By:  Tupaki Desk   |   18 Sept 2020 12:45 PM IST
ఆ ప్రైవేట్ స్కూల్స్ కి నోటీసులిచ్చిన ఏపీ ప్రభుత్వం!
X
కరోనా మహమ్మారి.. ఏపీలో రోజురోజుకీ మరింతగా విజృంభిస్తుంది. ఈ మహమ్మారి విజృంభన కారణంగా లాక్ డౌన్ అమలు చేయడంతో .. మార్చి 25 నుండి స్కూల్స్ మూత పడిన విషయం తెలిసిందే. అయితే , అప్పటినుండి ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే ఉద్యోగులు.. ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడుతున్నారు. తమ ఉద్యోగాలు పోయి కొంతమంది రోడ్లపై కూరగాయలు, పండ్లు, చెప్పులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం.. ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా జీతాలు ఇవ్వాలని ఆ యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను ఎవరూ కూడా సక్రమంగా పాటించడం లేదు. దీనితో చాలామంది ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే ఉపాధ్యాయులు ఉద్యోగులు.. తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని 20కి పైగా ప్రైవేట్ స్కూల్స్ కి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇందులో ఎక్కువగా శ్రీ చైతన్య కి సంబంధించిన స్కూల్స్ ఉండటం గమనార్హం. కరోనా క్లిష్ట సమయంలో.. ఉపాధ్యాయులకి..ఉద్యోగులకి గత కొన్ని నెలలుగా జీతాలు చెల్లించని కారణంగా జిల్లా విద్యాశాఖాధికారి నోటీసులు జారీ చేశారు.. నెల్లూరు రవీంద్ర భారతి ఈఎం హై స్కూల్ తణుకు, శసి ఈఎం హై స్కూల్ నల్లజర్ల, శివాని స్కూల్ ఏలూరు.. సివి రామన్ స్కూల్ భీమవరం.. శ్రీ విద్యానికేతన్ స్కూల్ ఆకివీడు.. ఇలా పలు స్కూళ్లకు డి ఈ ఓ నోటీసులు జారీ చేశారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ఉద్యోగులు..జీతాలు అందుకునేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి సంబంధిత అధికారులను ఆదేశించారు.