Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ప్లానేనా.? టీఆర్ ఎస్ ధీటైన స్పందన

By:  Tupaki Desk   |   3 Dec 2018 6:13 AM GMT
కాంగ్రెస్ ప్లానేనా.? టీఆర్ ఎస్ ధీటైన స్పందన
X
ఇది ఎన్నికల సమయం.. ప్రజలకు ఏమాత్రం బాధ కలిగినా అది ఓటింగ్ పై ప్రభావం పడుతుంది. ఈ ఎన్నికల వేళ బకాయిల పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు టీఆర్ ఎస్ సర్కారు కు షాకిచ్చాయి. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. బకాయిలు పేరుకుపోయాయని.. ఇవ్వకపోవడంతో ఇలా చేశామని చెప్పుకొచ్చాయి. కానీ దీనివెనుక కాంగ్రెస్ ఉందని గ్రహించిన టీఆర్ ఎస్ వెంటనే రంగంలోకి దిగి కాంగ్రెస్ కుట్రను భగ్నం చేసిందని విశ్వసనీయ సమాచారం. ప్రైవేటు ఆస్పత్రులను నయానా - భయానా సేవలు కొనసాగించేందుకు ఒప్పించాయి. ఎన్నికల వేళ జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్రవాప్తంగా మళ్లీ అందుబాటులో వచ్చాయి. ఆదివారం ఆరోగ్యశ్రీ ట్రస్టుతో ప్రైవేట్ ఆసుప్రతుల సంఘం ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ మాణిక్ రాజ్ హామీ మేరకు ఆరోగ్యశ్రీ సేవలతోపాటు ఉద్యోగులు, తదితరులకు ఇచ్చే ఆరోగ్య పథకాలను రాష్ట్రవాప్తంగా పునరుద్ధరిస్తున్నట్లు ప్రైవేటు ఆసుప్రతుల సంఘం ప్రతినిధులు ప్రకటించారు.

ప్రైవేట్ ఆసుప్రతుల సంఘం ప్రతినిధులతో భేటి అయిన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ మాణిక్ రాజ్ ప్రజాప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించాలని కోరారు. దీంతో గత కొన్ని రోజులుగా ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించడంలేదని సమ్మెకు దిగిన ప్రైవేట్ ఆసుప్రతులు పునరాలోచనలో పడ్డాయి. ఈమేరకు సీఈఓ ఆరోగ్యశ్రీ పథకం అమలు కోసం ఇప్పటికే 150కోట్లు విడుదల చేశామని తెలిపారు. మిగిలిన బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రైవేట్ ఆసుప్రతుల సంఘం ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

ఇప్పటికే విడుదల చేసిన 150 కోట్లతోపాటు మరో 150 కోట్లు నెలరోజుల్లో విడుదల చేస్తామని ట్రస్టు సీఈఓ హామీ ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా మిగిలిన బకాయిలు 2019 మార్చిలోగా చెల్లిందుకు అంగీకరించినట్లు ప్రైవేట్ ఆసుప్రతుల సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. అయితే ప్రధానంగా రోగుల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపారు. అలాగే నిధుల విడుదలకు సహకరించిన మంత్రి లక్ష్మారెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇలా సడన్ గా సమ్మె చేసిన ప్రైవేటు ఆస్పత్రులకు టీఆర్ ఎస్ ప్రభుత్వం వేగంగా స్పందించి నష్టనివారణ చర్యలు చేపట్టింది. వీరి వెనుక ఎవరున్నారన్న దానిపై గులాబీ శ్రేణులు ఆరాతీస్తున్నాయట.. చూడాలి మరీ ఏం జరుగుతుందో..