Begin typing your search above and press return to search.

పేషేంట్స్ ని పట్టించుకోని ప్రైవేట్ హాస్పిటల్..కారణం ఇదే?

By:  Tupaki Desk   |   30 March 2020 1:02 PM GMT
పేషేంట్స్ ని పట్టించుకోని ప్రైవేట్ హాస్పిటల్..కారణం ఇదే?
X
కరోనా ..కరోనా ..ఈ మహమ్మారి గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఈ మహమ్మారి తో దేశంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వాధికారులు - ప్రభుత్వ వైద్యులు తమ ప్రాణాలని సైతం పనంగా పెట్టి కరోనా సోకిన వారికీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. అయితే , చాలామంది సాధారణంగా ఏ చిన్న రోగం వచ్చి - ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తారు. కానీ , దేశం ఇలాంటి విపత్కర సమస్యని ఎదుర్కొంటున్న ఇటువంటి సమయంలో ..కాసులకు కక్కుర్తి పడే ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నాయి.

జనాల రక్తం తాగే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ - ట్రీట్ మెంట్ కోసం ఎమర్జెన్సీ గా వచ్చే కేసులను తీసుకోవట్లేదు. వారికీ ట్రీట్మెంట్ చేయడం మావల్ల కాదు అని - ప్రభుత్వం హాస్పిటల్స్ కి వెళ్లాలని సూచిస్తున్నారు. కేవలం కాళ్ళు - చేతులు విరిగిన కేసులు, గుండె జబ్బులు శ్వాసకు - జ్వరానికి సంబంధం లేని కేసులను మాత్రమే ట్రీట్ చేస్తున్నారు. కనీసం తీవ్ర జ్వరం తో వచ్చినా పట్టించుకోవట్లేదు.శ్వాస సంబంధిత దీర్ఘ కాలిక వ్యాధుల పేషెంట్ లను అస్సలు పట్టించుకోవట్లేదు. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్.

కరోనా అనుమానిత కేసు అని తేలితే - ట్రీట్ మెంట్ చేసిన ఆసుపత్రి సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్ చేయాలి. కాబట్టి , అంత రిస్క్ ఎందుకు అని అలాంటి రోగులకు ప్రైవేట్ ఆసుపత్రి వర్గా నో ఎంట్రీ బోర్డు పెడుతున్నారు. పేషెంట్ బందువులు ఈ జబ్బు ముందు నుండి ఉన్నదే అని ఎంత మొత్తుకున్నా హాస్పిటల్ లోకి ఎంట్రీ లేదంటున్నారు.

ఇకపోతే ఇప్పటికే కరోనా అనుమానిత కేసులతో గాంధీ నిండిపోయింది. మరి దీర్ఘ కాలిక శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడే పేషెంట్ లకు ఏదైనా అత్యవసర చికిత్స అవసరం అయితే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? ఇక వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏదైనా సీరియస్ అయితే ఊహించడానికి కష్టంగా ఉంది పరిస్థితి. దీనితో ప్రభుత్వం - వైద్య అధికారులు వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలను హెచ్చరించాలని అందరూ డమాండ్ చేస్తున్నారు. అలాగే సాధారణ రోజుల్లో లక్షల్లో డబ్బు కాజేసే ప్రైవేట్ హాస్పిటల్స్ ..ఇప్పుడు ఇలా చేయడం పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు మారుతుందేమో చూడాలి ..