Begin typing your search above and press return to search.

నర్సులకు భారీ ఆఫర్లు.. 50వేల జీతం

By:  Tupaki Desk   |   31 July 2020 11:50 AM GMT
నర్సులకు భారీ ఆఫర్లు.. 50వేల జీతం
X
కరోనా అందరికీ ఉద్యోగ, ఉపాధిని దూరం చేసింది. కానీ కొందరికీ మాత్రం అదే అందెవచ్చిన అవకాశంగా మలిచింది. కరోనా సంక్షోభంలో ఇప్పుడు నర్సులు.. పారామెడికల్ సిబ్బందికి పంట పండుతోంది. వారి కొరత కారణంగా డిమాండ్ భారీగా పెరిగిపోయింది.

ఫలితంగా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు నర్సులు, పారామెడికల్ సిబ్బంది కోసం ఎంతైనా చెల్లించడానికి సిద్ధమవుతున్నాయి. నర్సుల కొరత దృష్ట్యా వారికి భారీ ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులు ఎంత రేటు అయినా ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి.

కరోనా ట్రీట్ మెంట్ లో నర్సుల పాత్ర కీలకం. దీంతో నర్సులకు రూ.50వేల జీతం.. ఉచిత వసతి కల్పిస్తానంటూ ప్రకటనలిస్తున్నాయి. రోగులు కరోనా బారిన బాగా పడుతుండడంతో నర్సులకు ఫుల్ డిమాండ్ నెలకొంది.

నర్సింగ్ అయిపోయిన వారు.. రిజిస్ట్రేషన్ చేయించుకోని వారైనా సరే ఆసుపత్రులు వారిని ఆహ్వానిస్తుండడం విశేషంగా మారింది.

ఇక నర్సులు సైతం 30శాతం కరోనా బారినపడుతుండడంతో వారి కొరత వెంటాడుతోంది. దీంతో వారి ప్లేసులో కొత్త వారు రాక నర్సులకు డిమాండ్ నెలకొంది. నర్సులు కావాలంటూ వివిధ కార్పొరేట్ ఆస్పత్రులు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నాయి. ఇక నర్సులు దొరికితే వారిని తీసుకురావడానికి ఏకంగా చార్టెడ్ ఫ్లైట్ లను కూడా బుక్ చేసేందుకు కార్పొరేట్ యాజమాన్యాలు సిద్ధమయ్యాయి.