Begin typing your search above and press return to search.
ఆరోగ్య శ్రీ ద్వారా కోట్లు సంపాదించారు... రుణం తీర్చుకునే టైం వచ్చింది!
By: Tupaki Desk | 27 March 2020 10:00 AM ISTప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దాదాపుగా అన్ని దేశాలతో పాటు మన దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా రాత్రింబవళ్లు కష్టపడుతూనే ఉన్నాయి. అయితే ఈ కష్టపడుతున్న వారంతా ప్రభుత్వ ఉద్యోగులే. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి అయితే కంటి మీద కునుకు లేని పరిస్థితి. అరకొర వసతులతోనే అయినా... ప్రజల ప్రాణాల రక్షణే బాధ్యతగా ప్రభుత్వ ఆసుపత్రులు, ఆసుపత్రుల సిబ్బంది కష్టపడుతున్నారు. అయితే ప్రభుత్వ పథకమైన ఆరోగ్యశ్రీ తో కోట్లకు పగగలెత్తిన కార్పొరేట్ ఆసుపత్రులకు కరోనా కట్టడి బాధ్యత లేదా? అన్నది ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న. ఆరోగ్య శ్రీ చికిత్సల పేరిట వందలు, వేల కోట్ల రూపాయల నిధులను కార్పొరేట్ ఆసుపత్రులకు ఇస్తున్న తెలుగు రాష్ట్రాలు.. ఇప్పుడు కరోనా సేవలకు వాటిని ఎందుకు వినియోగించడం లేదు? ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్ లో ఉంటే... కార్పొరేట్ ఆసుపత్రులు కోరడమే ఆలస్యం.. వాటిని బకాయిలు చెల్లిస్తున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు.. ఇప్పుడు కరోనా బాధ్యతలను కార్పొరేట్ కు అప్పగించేందుకు ఎందుకు ఆసక్తి చూపడం లేదు? నిజమే.. ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రజల నుంచి కాస్తంత గట్టిగానే వినిపిస్తున్నాయి.
కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతమేర మెరుగైన సేవలున్నా... వాటి కంటే కూడా తమ వద్దే అత్యాధునిక వైద్య చికిత్సలు ఉన్నాయంటూ ప్రజలను ఇట్టే గుంజేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులకు ఇప్పుడు ఏమైంది? కరోనా కట్టడికి గానీ, కరోనా రోగులకు వైద్య సేవలందించడం లో గానీ... కార్పొరేట్ ఆసుపత్రులు ఎందుకు ముందుకు రావడం లేదు? కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు లాక్ డౌన్ అనగానే.. చడీచప్పుడు కాకుండా ఆసుపత్రులకు తాళాలు వేసుకుని మరీ వెళ్లిపోయిన కార్పొరేట్ వైద్య శాలల యాజమాన్యాలు.. అసలు కరోనా అన్న అంశమే తమ చెవిన పడనట్టుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం. వైద్య చికిత్సల ద్వారా వచ్చే లాభాల కోసం అయితే రేయింబవళ్లు పనిచేసే కార్పొరేట్ ఆసుపత్రులు.. విపత్తుల సమయంలో ఇలా చేతులెత్తేసి వెళ్లిపోవడం, అసలు సమాజంలో తాము లేమనే రీతిలో వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
అయినా కరోనాను కట్టడి చేసే విషయంలో ప్రజలపై ఆంక్షలు విధించడంతో పాటు అత్యవసర సేవల కిందకు వచ్చే ప్రభుత్వ విభాగాలకు సెలవులే లేకుండా ఆదేశాలు జారీ చేస్తున్న జగన్ గానీ, కేసీఆర్ గానీ... ఈ కార్పొరేట్ ఆసుపత్రుల దిశగా ఎందుకు దృష్టి సారించడం లేదన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల సంఖ్య వేలల్లోనే ఉందని చెప్పాలి. ఈ ఆసుపత్రులు అన్నీ రంగంలోకి దిగితే.. కరోనా కల్లోలం వేళ జనాలకు మరింత మెరుగైన సేవలందించే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా ఇద్దరు సీఎంలకు ఎందుకు గుర్తుకు రాలేదన్న విషయం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆరోగ్య శ్రీ పేరిట కోట్లాది నిధులను మంజూరు చేస్తున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు... ఇలా కరోనా విపత్తు వేళ... అసలు ఆ ఆసుపత్రులను వినియోగించుకునే దిశగా ఎందుకు ఆలోచన చేయడం లేదన్నది అర్థం కావడం లేదు. ఇప్పటికైనా... ఇటు కేసీఆర్ గానీ, అటు జగన్ గానీ.. ఇప్పటికిప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులను వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టడంతో పాటుగా కార్పొరేట్ ఆసుపత్రుల సిబ్బంది సేవలను వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు. మరి ఆ దిశగా ఇద్దరు సీఎంలు ఎప్పుడు చర్యలు చేపడతారో చూడాలి.