Begin typing your search above and press return to search.

ప్రైవేట్ ఆస్పత్రులపై సిద్ధమైన నివేదిక.. కొరఢా ఝలిపిస్తారా?

By:  Tupaki Desk   |   24 Sept 2020 5:00 AM IST
ప్రైవేట్ ఆస్పత్రులపై సిద్ధమైన నివేదిక.. కొరఢా ఝలిపిస్తారా?
X
కరోనా పేరుతో కాసులు కురిపించుకున్నారు. అమాయకపు రోగులను మించి ‘ప్రైవేటు’దోపిడీ విశృంఖంగా సాగింది. కరోనా మహమ్మారిని భయాన్ని ప్రైవేట్ ఆసుపత్రులన్నీ క్యాష్ చేసుకున్నాయని తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ నిగ్గుతేల్చింది.

ఒకటి కాదు.. రెండు కాదు.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన కరోనా చికిత్స ఫీజులకు 15 రెట్లు హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రులు ముక్కుపిండి మరీ వసూలు చేసిన దారుణం కళ్లకు గట్టింది. ఈ మేరకు ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ ల బృందం రాహుల్ బొజ్జా, సర్ఫరాజ్ అహ్మద్, డి.దివ్యలతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం ఈ మేరకు దర్యాప్తు చేసి నిగ్గు తేల్చింది.

కరోనా వేళ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేశాయని టాస్క్ ఫోర్స్ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఫీజుల పేరుతో లక్షల రూపాయలు గుంజినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా.. అంటువ్యాధుల చట్టాన్ని అతిక్రమించినట్లు టాస్క్ ఫోర్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నివేదికను టాస్క్ ఫోర్స్ నేడో, రేపో ప్రభుత్వానికి అందజేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

ఫిర్యాదులు వచ్చిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు చేసి, అధ్యయనం చేసింది. అక్రమాలపై నిగ్గు తేల్చారు. 15 రెట్లు ఎక్కువగా ఫీజులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

దీంతో అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద ఆ ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయినట్టు సమాచారం.