Begin typing your search above and press return to search.

లక్షల్లో ఫీజులు..ఆరోగ్యమంత్రి ఇలాకాలో అనధికార కరోనా ఆస్పత్రి

By:  Tupaki Desk   |   22 Aug 2020 4:04 PM GMT
లక్షల్లో ఫీజులు..ఆరోగ్యమంత్రి ఇలాకాలో అనధికార కరోనా ఆస్పత్రి
X
ఆంధ్రప్రదేశ్ కు ఆరోగ్యమంత్రి.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్ల నాని రాష్ట్రమంతా కరోనా వైరస్ ను నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే తన సొంత నియోజకవర్గం ఏలూరులో మాత్రం ఏం జరుగుతుందో చూసుకునే తీరిక మాత్రం లేనట్లే కనిపిస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నరసింహారావుపేటలో ఉన్న ఓ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి కొన్నాళ్లుగా వివిధ రోగాలకు చికిత్స అందిస్తోంది. కరోనా మొదలవగానే దోపిడీ పర్వానికి తెరలేపిందనే ఆరోపణలున్నాయి. కరోనా చికిత్సలకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఈ ఆస్పత్రిలో వసూళ్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో తనిఖీ నిర్వహించగా ఘోరాలు బయటపడ్డాయి. దాడుల్లో రూ.10లక్షల విలువైన రెమెడిసివిర్ ఇంజక్షన్లను సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా వైద్యం నిర్వహిస్తోందని తేలింది. చికిత్సలకు లక్షలు వసూలు చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు.

అయితే ఇంత దారుణం జరుగుతున్నా ఆరోగ్యమంత్రికి ఈ సమాచారం లేకపోవడం శోచనీయమంటున్నారు. ఆరోగ్య మంత్రి తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ తంతును గమనించడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి ఆస్పత్రులను అరికట్టాలని కోరుతున్నారు.