Begin typing your search above and press return to search.
భారత్ ఓపెనర్ పై 8 నెలల నిషేధం
By: Tupaki Desk | 31 July 2019 11:18 AM ISTభారత క్రికెట్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. అతి తక్కువ వయసులోనే భారత క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి ఓపెనర్ గా మారి కేవలం 18 ఏళ్ళ వయసులో మెరుపు శతకంతో దేశవ్యాప్తంగా తన పేరు మార్మోగేలా చేసిన ఓ క్రికెటర్ పై బీసీసీఐ నిషేధం విధించింది. పృథ్వీ షా అంటే ముంబై క్రికెట్ వర్గాల్లో జూనియర్ సచిన్ టెండూల్కర్ గా పేరు తెచ్చుకున్నాడు. అతి తక్కువ వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు వెస్టిండీస్ పై తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా జరిగిన టెస్టులో పృథ్వీ షా డోపీగా తేలడంతో 8 నెలల పాటు బిసిసిఐ అతడిపై ఎలాంటి క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ 20-20 టోర్నీలో భాగంగా ఇండోర్ లో మ్యాచ్ జరుగుతుండగా బిసిసిఐ పృథ్వీ షాకు డోపింగ్ పరీక్షలు నిర్వహించింది. పృథ్వీ షా మూత్ర నమూనాలు సేకరించి నిర్వహించిన ఈ పరీక్షల్లో అతడి శరీరంలో అనే టర్బుటలైన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. శరీరంలో శక్తి సామర్ధ్యాలను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఈ క్రమంలోనే అతడిపై బిసిసిఐ ఎనిమిది నెలల పాటు నిషేధం విధించింది. ఈ ఏడాది మార్చి 16 నుంచే నిషేధం అమలు అయ్యేలా ఆదేశాలు జారీ చేయడంతో నవంబరు 15 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ 8 నెలల కాలంలో అతడు ఎలాంటి క్రికెడ్ ఆడకూడదు. పృథ్వీ షాకు కొంతలో కొంత ఊరట ఏంటంటే నిషేధం మార్చి నుంచే అమల్లో ఉండడంతో వచ్చే నవంబర్ కల్లా కంప్లీట్ కానుంది. అప్పటి నుంచి అతడు తిరిగి మ్యాచ్ లు ఆడవచ్చు.
ఈ టర్బుటలైన్ సాధారణంగా దగ్గు మందులో ఉంటుంది. షా ఆ టోర్నీ ఆడుతున్నప్పుడు తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నందునే దగ్గు మందు తీసుకున్నాడట. అలా ఆ ఉత్ప్రేరకం తాను కావాలని తీసుకోలేదని కూడా వివరణ ఇచ్చాడు. పృథ్వీతో పాటు విదర్భ ఆటగాడు అక్షయ్ దలర్వార్ - రాజస్థాన్ ఆటగాడు దివ్య గజరాజ్ సైతం డోపింగ్ పరీక్షల్లో విఫలమయ్యారు. వారికి కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది.