Begin typing your search above and press return to search.

మోడీ ఏం చేసినా డిబెట్టే.. ఒట్టు బెట్టు

By:  Tupaki Desk   |   13 March 2022 10:00 AM IST
మోడీ ఏం చేసినా డిబెట్టే.. ఒట్టు బెట్టు
X
అమృతం తాగించిన అమ్మ..చంద‌మామ క‌థ‌లు చెప్పిన అమ్మ.. ప్ర‌ధానికి అయినా ఓ సామాన్యుడికి అయినా ఒక్క‌టే.దేశ ప్ర‌ధానిగా మోడీ బాధ్య‌త‌ల్లో భాగంగా కొంద‌రు త‌ల్లుల‌కు అండ‌గా కేంద్రం ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ఆడ‌బిడ్డ‌ల‌కు అండ‌గా ఉంటే ఇంకా బాగుంటుంది.

మ‌హిళా శ‌క్తి చాటేందుకు కేంద్రం ప‌లు ప్ర‌క‌ట‌న‌లు చేస్తూనే,సంబంధిత కార్యాచ‌ర‌ణ అమ‌లులో ఉంచితే ఇంకా బాగుంటుంది.ఇవేవీ లేకుండా భావోద్వేగాల క్రీడ‌లో భాగంగా మోడీ కానీ మ‌రొక‌రు కానీ న‌డుచుకోవ‌డంలో స‌మ్మ‌తి లేదు..అన్న‌ది విప‌క్ష వ‌ర్గాల విమ‌ర్శ మ‌రియు విశ్లేష‌ణ కూడా!

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏం చేసినా ప‌బ్లిసిటీలో భాగంగానే చేస్తుంటారా ? ఆఖ‌రికి అమ్మ ద‌గ్గ‌ర‌కు పోయినా ఏఎన్ఐకు చెప్పే వెళ్తారా? అంటే అవున‌నే అంటున్నాయి తాజా ప‌రిణామాలు.మాతృమూర్తి సేవ‌లో సీఎం నుంచి పీఎం వ‌ర‌కూ అంతా పునీతం అవ్వాలి. కాద‌నం కానీ వాటిని పోస్టుల రూపంలో ఉంచి, ప‌బ్లిక్ డొమైన్ల‌లో క‌నిపించి హ‌ల్చ‌ల్ చేయాల‌నుకోవ‌డం త‌గ‌దు.

ప్ర‌ధాని మోడీ మాతృమూర్తి అయినా మామూలు మ‌నిషి త‌ల్లి అయినా ఒక్క‌టే. బిడ్డ‌ల పెంప‌కంలో త‌ల్లులు చూపే అస‌మాన ప్ర‌తిభ‌లో కొద్ది పాటి వ్య‌త్యాసాలు ఉంటాయేమో కానీ..అంద‌రి త‌ల్లులూ ఉన్న‌తులే! దేశ ప్ర‌ధాని ఎప్పుడు త‌న త‌ల్లి ద‌గ్గ‌ర‌కు పోయినా ఫొటోలు మాత్రం త‌ప్ప‌క పంపిస్తారు. వాటి వ‌ల్ల ఏం ప్ర‌యోజ‌నం. ఈ దేశ ప్ర‌ధానిగా ఉంటూ మాతృమూర్తుల సంక్షేమం కోసం చేప‌ట్టిన చ‌ర్య‌లెన్ని అన్న‌ది చ‌ర్చ‌కు వ‌స్తోంది ఇవాళ.

మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు మోడీ తీసుకున్న చ‌ర్య‌లెన్ని అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తుంది.ఆయ‌న చ‌ర్య‌లన్నీ ప్ర‌చార కాంక్ష‌ల‌లో భాగంగా ఉంటాయి అనేందుకు ఇప్ప‌టికే చాలా ఉదంతాలు లేదా ఘ‌ట‌న‌లు ఉదాహ‌ర‌ణ‌లు అయ్యాయి.తాజాగా మోడీ వెలువ‌రించిన ఫొటోలు కూడా ఇలాంటి కోవ‌కో చెందుతాయి.

అమ్మ‌కు వంద‌నం చెప్పి రావ‌డం, అమ్మ క‌ష్టం సుఖం తెలుసుకోవ‌డం అన్న‌వి మంచివే కానీ వాటిని ప‌బ్లిసిటీకి వాడుకోవ‌డంలోనే త‌ప్పిదాలు ఉన్నాయేమో! అయినా కూడా మోడీ దేశ ప్ర‌ధాని క‌నుక సంబంధిత ఆస‌క్తి ఉంటుంది క‌నుక ఆ విధంగా చేయ‌డం త‌ప్పేం కాదు అని బీజేపీ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.