Begin typing your search above and press return to search.

కరోనాపై మనదే విజయం.. ప్రధాని సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   28 Jan 2021 7:26 PM IST
కరోనాపై మనదే విజయం.. ప్రధాని సంచలన ప్రకటన
X
గత మార్చిలో దేశంలో కరోనా కేసులు ముదిరి దేశమంతా లాక్ డౌన్ తో బందీ అయిపోయింది. లక్షల మంది ఉద్యోగ, ఉపాధి పోయి రోడ్డునపడ్డారు. కానీ మనుషుల ప్రాణాల కన్నా డబ్బులు ముఖ్యం కాదని అందరూ ఇంటిపట్టునే ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సైతం మైనస్ -28శాతానికి పైగా దిగజారింది. దేశంలో కరోనా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.

అయినా కూడా అన్నింటిని అధిగమించి ఇప్పుడు వ్యాక్సిన్ పంపిణీని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే కరోనా అవరోధాలను అధిగమించామని.. కరోనాపై విజయం సాధించినట్టేనని ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు.ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం ద్వారా ఈ విజయం సాధ్యమైందని మోడీ తెలిపారు. కేవలం 12 రోజుల్లో 2.3 మిలియన్ల ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇచ్చామని ప్రపంచ ఆర్థిక వేదికలో వర్చువల్ ద్వారా ప్రసంగిస్తూ మోడీ చెప్పారు.రానున్న కొద్దినెలల్లోనే 300 మిలియన్ సీనియర్ సిటిజన్లకు వ్యాక్సిన్ ఇస్తామని మోడీ తెలిపారు. కరోనా అడ్డంకులను భారత్ అధిగమించిందని తెలిపారు.