Begin typing your search above and press return to search.

మోడీ అంటే అదే : కాన్వాయ్ సడెన్ గా ఆపేసి మరీ...?

By:  Tupaki Desk   |   1 Jun 2022 9:00 AM IST
మోడీ అంటే అదే : కాన్వాయ్ సడెన్ గా ఆపేసి మరీ...?
X
నరేంద్ర మోడీ. షార్ట్ కట్ లో నమో. ఈ దేశాన్ని ఈ పేరు గత కొన్ని సంవత్సరాలుగా అలా ఉర్రూతలూగిస్తూనే ఉంది. ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న మోడీ ఏలుబడిలో మంచీ చెడులూ రెండూ ఉన్నాయి. కానీ వ్యక్తిత్వం పరంగా మోడీ విలక్షణమైన వారు. ఆయనకు జాతీయ స్థాయిలో ఈ రోజుకీ ధీటైన నాయకుడు లేరంటే అతిశయోక్తి కాదు.

మోడీకి తల్లి అంటే ప్రాణం. తొంబైలు దాటిన మోడీ తల్లి హీరాబెన్ మోడీ అంటే ప్రధానికి ఎంతో ప్రేమ. గుజరాత్ వెళ్ళినపుడల్లా తల్లిని చూడకుండా ఆయన అసలు ఉండరు. దేశానికి రాజు అయినా తల్లి ముందు పసివాడే అని చెబుతారు. అది ఆచరణలో నిరూపించిన ఘనత మోడీది.

ఆయనకు ప్రేమాభిమానాలు తెలియవు. ఒంటరి వారు, సెంటిమెంట్లు లేవని రీసెంట్ గా తెలంగాణాలో టీయారెస్ నాయకులు ఘాటు విమర్శలు చేశారు. అంతకు ముందు ఏపీలో ఉన్న టీడీపీ నాయకులు కూడా ఇదే మాట అని తాముగా తగ్గించుకున్నారు. ఇవన్నీ అబధ్దాలు, నిజానికి మోడీకి సెంటిమెంట్లు ఉన్నాయి. తల్లితో ఆయనకు ఉన్న అనుబంధం గొప్పది.

అది ఎన్నో సార్లు రుజువు అయింది. ఇపుడు మరో సారి హిమాచల్ ప్రదేశ్ టూర్ సందర్భంగా మరోసారి రుజువు అయింది. మోడీ హిమాచల్ ప్రదేశ్ టూ లో ప్రధాని కాన్వాయ్ వేగంగా దూసుకుపోతోంది. సిమ్లాలో రోడ్డుకు ఇరువైపులా నిల‌బ‌డ్డ జ‌నానికి అభివాదం చేస్తూ స్పీడుగా సాగుతున్న మోడీకి ఇరు వైపులా జనాలు చూసి జేజేలు పలుకుతున్నారు. మోడీ కూడా వారిని చూస్తూ అలా ముందుకు సాగుతున్నారు.

అంతలో ఆ జనాల మధ్యలో ఒక బాలిక మోడీ తల్లి హీరాబెన్ మోడీ చిత్రపటాన్ని గీసి మోడీకి ఇద్దామని పట్టుకుని ఉంది. అంతమంది జనాల మధ్యన ఆమె ఆశ తీరేది కాదేమో. కానీ ఆమె తన వంతుగా ప్రయత్నం చేసింది. మోడీ కంట ఆ చిత్రపటం కనబడింది. దానికంటే ముందు తల్లి రూపం కనిపించింది. అంతే మోడీ కావాయ్ ని సడెన్ గా ఆపించేశారు.

నేరుగా ఆ బాలిక వద్దకు వెళ్ళి చిత్రపటాన్ని తీసుకున్నారు. ఆ బాలిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. బారీకేడ్ల‌కు ఆవల నిలుచుండి మ‌రీ మోదీ కాళ్ల‌కు ఆ బాలిక న‌మ‌స్క‌రిస్తే మోదీ ఆ బాలిక‌ తల మీద చేతులు ఉంచి నిండుగా ఆశీర్వ‌దించారు. తల్లి చిత్రాన్ని ప్రేమగా మురిపెంగా చూసుకున్నారు. ఈ సన్నివేశం అక్కడ అందరినీ ఆశ్చర్యపరచింది.

ప్రధాని కాన్వాయి ఆపడం ఎవరి వల్లా కాదు, కానీ ఆపగలిగింది మోడీ తల్లి మాత్రమే. ఆ చిత్రపటమే మోడీని ఆ సామాన్య బాలిక వద్దకు వచ్చేలా చేసింది. అదీ ప్రేమంటే. మరి మోడీకి సెంటిమెంట్లు లేవంటారా. ఆయనకు ప్రేమ లేదంటారా. కళ్ళ ముందు కనిపిస్తున్నవి అన్నీ చూసిన వారికి మోడీ ఏ బంధాలు లేని మనిషిగా కనిపిస్తున్నారా. ఏమో అలా అనుకుంటే అది వారి దృష్టి లోపంగానే చూడాలేమో.