Begin typing your search above and press return to search.
సడెన్ గా ఏపీకి మోడీ...మ్యాటరేంటో...?
By: Tupaki Desk | 5 May 2022 8:43 PM ISTప్రధానమంత్రి మోడీ ఇపుడిపుడే టూర్లు పెట్టుకుంటున్నారు. రెండేళ్ళుగా కరోనా మహమ్మారి ఇబ్బందులు పెట్టడంతో ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి. దాంతో ఇపుడు అంతా అనుకూలంగా ఉండడంతో యూరప్ ట్రిప్ కి మోడీ వెళ్ళి వచ్చారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే అక్కడ మాత్రమే ఇప్పటిదాకా మోడీ పాలుపంచుకుంటున్నారు.
అయితే ఇపుడు మోడీ సౌత్ స్టేట్స్ మీద దృష్టి సారించారు అని అంటున్నారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మీద గురి పెట్టారు అని చెబుతున్నారు. ఈ రెండింటిలో తెలంగాణాలో ఆశలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అదే టైమ్ లో ఏపీలో పొత్తులతో బీజేపీ బండిని లాక్కురావాలి. ఇక మిత్రులతో ఇబ్బంది లేకుండా చేసుకుని వచ్చే ఎన్నికల్లో మూడవసారి అధికారంలోకి వచ్చేలా పధక రచన చేయాలి.
ఇదే మోడీ అమిత్ షాల మాస్టర్ ప్లాన్. ఈ నేపధ్యంలో ముందుగా ఎదుటి వారితో రాజకీయ బేరాలు కంటే తమ పార్టీని ఎంతో కొంత పటిష్టం చేసుకోవడం ముఖ్యం. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ళ టైమ్ ఉంది కాబట్టి ఈ లోగా పలు దఫాలుగా టూర్లు ఏపీ లాంటి చోట్ల వేయాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపధ్యంలో మోడీ వచ్చే నెల అంటే జూన్ లో ఏపీ టూర్ వేస్తున్నారు. ఆయన ఏపీలో ఒక రోజు ఉంటారా రెండు రోజులు ఉంటారా అన్నది ఇంకా తేలలేదు. అలాగే ఆయన ఏ ప్రాంతానికి వస్తున్నారు. ఏ సిటీని టచ్ చేస్తారు అన్న దాని మీద కూడా ఇంకా ఆలోచనలు సాగుతున్నాయి. మొత్తానికి అయితే పూర్తిగా రాజకీయ కారణాలతోనే మోడీ ఏపీకి వస్తున్నారు.
అంటే ఢిల్లీ వెళ్ళినపుడు జగన్ని హత్తుకుని నవ్వుతూ ఆయనతో మాట్లాడే మోడీ ఏపీలో ఈసారి జరిపే టూర్ లో మాత్రం కచ్చితంగా జగన్ సర్కార్ ని విమర్శించాల్సి ఉంటుంది. అన్నీ కేంద్ర పధకాలే అని ఇప్పటిదాకా బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చెప్పిన మాటలను మోడీ కూడా చెప్పాలి. అలా కనుక చెబితే జగన్ కి అవి డైరెక్ట్ గానే తగులుకునే బాణాలు అవుతాయి.
అయినా సరే మోడీ అయినా బీజేపీ నేతలు అయినా ముందు పార్టీనే చూసుకుంటారు. పార్టీ కోసమే వారు ఏమైనా చేస్తారు. సో ఫస్ట్ టైమ్ మోడీ జగన్ని టార్గెట్ చేయబోతున్నారు అన్న మాట. ఇక మోడీ టూర్ వచ్చే నెలలో ఉన్న నేపధ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల చివరి వారంలో ఏపీకి వస్తారు అని కూడా పార్టీ వర్గాల సమాచారం. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో తమ వాటా తేల్చుకోవడానికి కేంద్ర బీజేపీ రెడీ అవుతోంది. చూడాలి మరి ఆ పరిణామాలు ఎలా ఉంటాయో.