Begin typing your search above and press return to search.

ఛాన్స్ దొరికింది.. ర‌ష్యాను మోడీ ఆడేసుకుంటున్నారుగా! ఎలాగంటే!!

By:  Tupaki Desk   |   5 May 2022 6:00 AM IST
ఛాన్స్ దొరికింది.. ర‌ష్యాను మోడీ ఆడేసుకుంటున్నారుగా! ఎలాగంటే!!
X
వ్యాపారం అంటే.. వ్యాపార‌మే. పైగా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అస‌లే మామూలోడు కార‌నే మాట ఎలానూ ఉంది. ఇప్పుడు ఇదే ఆయ‌న లైన్‌లో పెట్టారు. ``మీ స‌రుక్కి.. ఇప్పుడు డిమాండ్ లేదు. పైగా.. ఎవ‌రూ కొన‌ద్ద‌ని ఆంక్ష‌లుకూడా ఉన్నాయి. అయినా.. మేం రిస్క్ చేస్తున్నాం. సో.. మీరు చెప్పిన ధ‌ర కాదు.. మేం ఇచ్చింది పుచ్చుకోవాల్సిందే!`` అని ర‌ష్యాకు తెగేసి చెప్పారు. దీంతో ఇప్పుడు ర‌ష్యా ప‌రిస్థితి.. కుడితో ప‌డ్డ ఎలుక‌గా మారిపోయింది. చ‌చ్చినోడి పెళ్లికి వ‌చ్చిందే చాల‌ని అనుకునే ప‌రిస్థితి కూడా దాపురించింది.

ఏం జ‌రిగిందంటే..

ఉక్రెయిన్‌, రష్యా మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత్‌కు ముడి చమురును చౌకగా అందుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం రష్యా నుంచి జరుపుతున్న చమురు దిగుమతుల్లో కాస్త మార్పులు చేసేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు రష్యా ఆఫర్‌ చేసిన ధరకు కాకుండా చమురుపై మరింత రాయితీ ఇవ్వాలని, బ్యారెల్‌కు 70 డాలర్ల కంటే తక్కువకు భారత్‌ అమ్మాలని రష్యాను కోరింది. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితుల్లో పలు దేశాల ఆంక్షల రష్యా పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఒపెక్‌( ఓపీఈసీ) దేశాల నుంచి రిస్క్‌ను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఈ మేరకు ప్రతిపాదన చేసింది. కాగా, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఒక బ్యారెల్‌ ధర సుమారు 108 డాలర్లు ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వ, ప్రైవేట్ ఆయిల్‌ సంస్థలు రష్యా రాయితీ ప్రకటించడంతో 40 మిలియన్‌ బ్యారెల్స్‌ ముడి చమురును కొనుగోలు చేశాయి. 2021లో రష్యా నుంచి భారత్‌ చమురును కొనుగోలు చేసిన దాని కంటే ఇది 20 శాతం అదనమని గణాంకాలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యం కారణంగా.. ఆయిల్‌ వ్యాపారం రష్యాకు మరింత కఠినంగా మారింది. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరో కొనుగోలుదారుడితో తమ వ్యాపార లావాదేవీలు అంత సులువుగా రష్యా జరపలేదు. ఈ సమయంలో రష్యా నుంచి జరుపుతున్న దిగుమతుల కారణంగా భారత్‌ భవిష్యత్తులో వాణిజ్య పరంగా ఇతర దేశాలతో ఇబ్బందులు ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యారెల్‌కు 70 డాలర్ల కంటే తక్కువకు చమురును అమ్మాలని రష్యాను భారత్‌ కోరుతోంది. కాగా ఈ ప్రతిపాదనకు రష్యా నుంచి ఎలా స్పందన రాబోతోందో చూడాలి.

ప్ర‌పంచం ఆంక్ష‌ల కొర‌డా!!

ఉక్రెయిన్‌పై దూకుడు పెంచిన రష్యా మీద.. అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షల పదును మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా.. పాశ్చాత్యదేశాలతో రష్యా వ్యాపార సామర్థ్యాన్ని దెబ్బతీసేలా ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ.. రష్యా వెనక్కి తగ్గకపోవడం వల్ల ఆరో విడత ఆంక్షలను విధించేందుకు ఐరోపా సమాఖ్య సిద్ధమైంది. రష్యా చమురు దిగుమతు లపై దశలవారీ ఆంక్షలతో పాటు, మాస్కో సైన్యాధికారులు, రష్యా టీవీ ఛానళ్లపై చర్యలు వంటివి ఆంక్షల ప్రణాళికలో ఉన్నాయి.

రష్యా చమురు దిగుమతులపై.. దశలవారీగా ఆంక్షలు విధించడం ఈ ప్రతిపాదనల్లో.. ప్రధాన అజెండాగా ఉంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపేసేందుకు.. ఈయూలోని 27 సభ్య దేశాలకు 6 నెలల సమయం, సంబంధిత ఉత్పత్తులకు స్వస్తి చెప్పేందుకు.. 8 నెలల సమయం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రష్యా చమురుపై ఆధారపడటాన్ని ఐరోపా దేశాలు ముగిస్తున్నట్లు ఈయూ చీఫ్‌ ప్రకటించారు. ఇది చెప్పినంత సులభం కాకపోయిన.. చేసి తీరాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.