Begin typing your search above and press return to search.
గ్రహాలు ఎంత బలంగా మోడీకి అండగా ఉంటాయో చెప్పారు
By: Tupaki Desk | 3 April 2022 5:00 PM ISTఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణాన్ని నిర్వహిస్తుంటారు. ఈ పండుగ వేళ రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమకు కొత్త సంవత్సరం ఎలా ఉంటుందన్న దానిపై పండితులతో పంచాంగ పఠనాన్ని నిర్వహిస్తుంటారు. బీజేపీకి సంబంధించి హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. దీనికి శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు గర్రెపల్లి మహేశ్వరశర్మ హాజరయ్యారు. ఆయన పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతక చక్రంలో అద్భుత యోగం ఉందని.. ఆయనకు తిరుగులేదని పేర్కొన్నారు. ఆయన ఏ నిర్ణయాన్ని తీసుకున్నా దేశ ప్రజలు గౌరవిస్తారని.. దేశంలో భక్తి భావం పెరుగుతుందన్నారు. పాలనలో పీఠాధిపతులు జోక్యం చేసుకుంటారని.. రాజకీయ రంగంలో అలజడి ఉంటుందన్నారు.
సీబీఐ.. ఈడీ లాంటి సంస్థలు సంచలన విషయాల్ని వెల్లడిస్తాయని చెప్పి.. దేశ ఆర్థిక ప్రగతిని సాధిస్తుందన్నారు. అన్నింటికి మించి 2028 మే ఐదు వరకు మోడీ ఎదురే ఉండదని స్పష్టం చేయటం గమనార్హం. అంటే.. మరో ఆరేళ్ల వరకు ఆయనకు తిరుగులేదని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీనే విజయం సాధిస్తుందన్న విషయాన్ని ఆయన తన పంచాంగ శ్రవణంలో చెప్పారు. దేశంలో పాలన సమర్థంగా.. నెమ్మదిగా సాగుతుందని.. ఇతర దేశాలతో స్నేహ బంధం పెరుగుతుందన్నారు.
సరిహద్దుదేశాలతో అప్పుడప్పుడు యుద్ధ వాతావరణం ఉంటుందని.. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తారన్నారు. దేశంలో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని.. ప్రతి వస్తువు ధర పెరుగుతుందన్నారు. రాజకీయ నేతలు పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. హిమాచల్ ప్రదేశ్.. గుజరాత్ రాష్ట్రాల్లో అధికార పార్టీకి తిరుగులేదని పేర్కొన్నారు. మొత్తంగా సమీప భవిష్యత్తులో మోడీకి ఎదురే లేదని తేల్చిన బీజేపీ పంచాంగ శ్రవణం ఏమేరకు నిజమవుతుందో కాలమే చెప్పాలి.