Begin typing your search above and press return to search.
మోడీ అంటే మోడీనే...?
By: Tupaki Desk | 22 Feb 2022 8:00 AM ISTనరేంద్ర మోడీ. ఎనిమిదేళ్ళుగా డైనమిక్ ప్రధానిగా దేశంతో పాటు విదేశాల్లో కూడా తెలిసిన పేరు ఇది. అంతకు ముందు గుజరాత్ సీఎం గా మోడీ తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉండేవారు. ఇక మోడీ స్టైల్ వేరు. ఆయన రూటే వేరు. ఆయన ఏం చేసినా సంచలనమే. ఆయన వేషం కానీ, మాట్లాడే విధానం కానీ ఇవన్నీ కూడా ఎపుడూ కొత్తే.
ఇక ఆ మధ్యన అంటే కరోనా ఉధృతంగా ఉన్న టైమ్ లో మోడీ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి ఔరా అనిపించుకున్నారు. మోడీ సార్ ఎంతటి వారు అని ప్రతీ వారూ అన్నారు. ఆయన డౌన్ టూ ఎర్త్ అని కూడా నాడు పొగిడారు. ఇపుడు చూస్తే మోడీ మరో ట్రెడిషన్ కి తెరతీశారు. అది మిగిలిన పార్టీల వారు పాటిస్తారా అంటే ఏమో కానీ మోడీ మాత్రం తన స్పెషాలిటీ ఏంటో అలా చూపించారు.
యూపీ ఎన్నికల్లో బిజీగా తిరుగుతున్న మోడీ ఉన్నావ్ జిల్లా ప్రెసిడెంట్ అవదేశ్ కతియార్ పాదాలకు నమస్కరించి సంచలనం క్రియేట్ చేశారు. ఇంతకీ అసలు జరిగినదేంటి అంటే ఉన్నావ్ లో జరిగిన ప్రచారంలో మోడీ పల్గొన్న వేదిక వద్దకు బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ తో పాటు అవదేశ్ కతియార్ కూడా వచ్చారు.
ఈ సందర్భంగా కతియార్ మోడీకి శ్రీరాముడి విగ్రహాన్ని బహూకరించి ప్రధాని కాళ్ళకు నమస్కరించేందుకు సిద్ధపడ్డారు. అది చూసిన వద్దని వారించడమే కాదు, ఆ వెంటనే చేసిన చర్య అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యచకితులను చేసింది.
నాకు మీరు కాదు మొక్కాల్సింది, నేనే మీకు మొక్కుతాను అంటూ మోడీ ఆయన కళ్ళకు నమస్కరించడంతో అక్కడ అంతా ఒక్క సారిగా షాక్. ఆ వెంటనే చప్పట్లలో మారు మోగించారు. మొత్తానికి మోడీ అంటే మోడీయే అని ఆయన అలా మరో మారు నిరూపించుకున్నారన్న మాట. ఇక ఈ మొత్తం సంఘటన మీద బీజేపీ వారు విడుదల చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. మోడీ ఈజ్ గ్రేట్ అని బీజేపీ శ్రేణులు గట్టిగా ప్రశంసిస్తున్నాయి. అంతే కదా మరి.