Begin typing your search above and press return to search.

మోడీ ఆస్తుల విలువ ఇంతే.. ఉన్న ఇంటిని దానం చేశారట!

By:  Tupaki Desk   |   10 Aug 2022 9:52 AM GMT
మోడీ ఆస్తుల విలువ ఇంతే.. ఉన్న ఇంటిని దానం చేశారట!
X
తనకున్న ఆస్తుల వివరాల్ని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ఏడాది వ్యవధిలో ఆయనకున్న ఆస్తుల వివరాలు అందరికి తెలిసినట్లైంది. ఈసారి ఆయన ఆస్తుల వివరాల్ని చూసినప్పుడు.. ఆయనకు ఉన్న ఒకే ఒక్క స్థిరాస్తి కనిపించకుండా పోయింది.

కారణం..గాంధీ నగర్ లో ఉన్న ఒక నివాస స్థలాన్ని (14,125 చదరపు అడుగులు) మరో ముగ్గురుతో కలిసి కోనుగోలు చేశారు. అప్పట్లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. అందులో ఒక్కొక్కొరికి 3531.45 చదరపు అడుగుల చొప్పున భాగస్వామ్యం ఉంది.

అప్పట్లో దాని విలువ రూ.1.30 కోట్లు. అయితే.. అందులో నిర్మాణం చేప్టటారు. అయితే ఆ స్థిరాస్తిని వితరణ ఇచ్చేసినట్లుగా పేర్కొన్నారు. దీంతో.. ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ఒకే ఒక్క స్థిరాస్తి కూడా లేనట్లైంది.

చరాస్తుల విషయానికి వస్తే ఆయన తన ఆస్తుల విలువ ఏడాదిలో రూ.26లక్షలు పెరిగినట్లుగా పేర్కొన్నారు. మార్చి 31 నాటికి ఆయన తన చేతిలో ఉన్న క్యాష్ రూ.35,250 మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది ఆయన చేతిలో నగదు రూ.36,900 ఉన్నట్లుగా పేర్కొన్నారు. బ్యాంకు బ్యాలెన్సు గత ఏడాది రూ.1,52,480గా ఉండేది. అది కాస్తా ఈ ఏడాదికి రూ.46,555కు తగ్గిపోయింది.

అదే సమయంలో జాతీయ పొదుపు పత్రాల్లో పెట్టుబడి రూ.8.93 లక్షల నుంచి రూ.9.05లక్షలకు పెరిగింది. జీవిత బీమా పాలసీల ప్రీమియం చెల్లింపుకూడా పెరిగినట్లు పేర్కొన్నారు.

ఇవి కాక ఆయన వద్ద రూ.1.73 లక్షల విలువ చేసే నాలుగు ఉంగరాలు.. బ్యాంకు ఎఫ్ డీఆర్.. ఎంవోడీ బ్యాలెన్సులు గత ఏడాది రూ.1.83 కోట్లుగా ఉంటే ఈ ఏడాది అవి కాస్తా రూ.2.10 కోట్లకు పెరిగినట్లుగా పేర్కొన్నారు. ఎప్పటిలానే భార్య ఆస్తుల వివరాల గురించి పేర్కొనగా.. తెలీదని వెల్లడించారు. మొత్తానికి స్థిరాస్తి లేని ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ నిలిచారని చెప్పొచ్చు.