Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ తల్లి 100వ పుట్టినరోజు.. కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న పీఎం

By:  Tupaki Desk   |   18 Jun 2022 8:30 AM GMT
ప్రధాని మోడీ తల్లి 100వ పుట్టినరోజు.. కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న పీఎం
X
ఇప్పుడు దేశంలోనే పవర్ ఫుల్ ఎవరంటే అది ప్రధాని మోడీ.. దేశానికి ప్రధాని అయినా ఆ తల్లికి మాత్రం కొడుకే. అందుకే ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే.. అప్పుడప్పుడూ వీలుచూసుకొని తల్లిని కలుస్తుంటారు ప్రధాని మోడీ. గుజరాత్ వెళ్లి ఆమెతో గడుపుతారు. ఇవాళ ప్రధాని మోడీ తల్లి 100వ పుట్టినరోజు సందర్భంగా ఇంటికి వెళ్లారు మోడీ. ఆమె కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు.

100 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా ప్రత్యేకమైన విషయం అని.. అందుకే ప్రధాని మోడీ స్వయంగా వెళ్లి తల్లికి పుట్టినరోజును జరిపారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ మొదట గాంధీనగర్ లోని తమ ఇంటికి వెళ్లారు.

తల్లి హీరోబెన్ కు శుభాకాంక్షలు తెలిపి స్వీట్ తినిపించారు. అనంతరం తల్లి కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లి పక్కన కూర్చొని ఆమెతో కాసేపు మాట్లాడారు. సరదాగా కబుర్లు చెప్పారు. కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఈ కార్యక్రమం జరిగింది.

2014లో దేశ ప్రధాని కావడానికి కొన్ని రోజుల ముందు హీరాబెన్ ఆశీస్సులు తీసుకోవడానికి మోడీ వెళ్లగా నాడు మోడీకి రూ.101 ఇచ్చి ఈ కొత్త ప్రయాణంలో విజయం సాధించాలని తల్లి ఆశీర్వదించారు. మోడీ తల్లి హీరాబెన్ ఈ వయసులోనూ దేశం పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.

ఎన్నికల్లో ఓటు వేయడం.. నోట్ల రద్దు సమయంలో పాత రద్దయిన నోట్లను మార్చడం.. కరోనా కాలంలో థాలీ వేలన్ ఆడటం వంటి విషయాల్లో హీరాబెన్ ఎప్పుడూ ముందంజలో ఉంటాయి. రద్దయిన నోట్లను మార్చుకునేందుకు జనం బారులుతుండగా 90 ఏళ్లు దాటిన హీరా బెన్ కూడా సామాన్యురాలిగా లైన్లో నిలుచొని ప్రజల్లో స్ఫూర్తి నింపారు.

హీరో బెన్ 100వ బర్త్ డే సందర్భంగా గుజరాత్ లోని గాంధీనగర్ రైసెన్ ప్రాంతంలోని 80 మీటర్ల రహదారికి ఆమె పేరు పెట్టారు. తద్వారా ఆమె జీవితం తరువాతి తరం స్ఫూర్తి పొందుతారని గాంధీనగర్ మేయర్ హితేష్ మక్వానా వెల్లడించారు.