Begin typing your search above and press return to search.

అయోధ్య ప్రసాదాన్ని మోడీ చేతుల మీదుగా అందుకున్న తొలి వ్యక్తి ఎవరంటే?

By:  Tupaki Desk   |   6 Aug 2020 11:01 PM IST
అయోధ్య ప్రసాదాన్ని మోడీ చేతుల మీదుగా అందుకున్న తొలి వ్యక్తి ఎవరంటే?
X
అయోధ్యలో రామాలయ నిర్మాణంలో కీలకమైన భూమిపూజ కార్యక్రమాన్ని యావత్ దేశం ఎంతో ఉత్సాహంగా వీక్షించారు. కొందరు విమర్శలు చేసేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చూస్తే.. మెజార్టీ ప్రజలు మాత్రం భక్తి పారవశ్యంలో మునిగిపోతూ.. ఈ అరుదైన కార్యక్రమాన్ని కనులారా చూశారు. అయోధ్యలో నిర్వహించిన భూమిపూజ అనంతరం ప్రధాని మోడీ రామాలయ ప్రసాదాన్ని కొందరికి అందించారు. అలా ప్రధాని చేతుల మీదుగా ప్రసాదాన్ని అందుకున్న తొలి వ్యక్తి ఎవరో తెలుసా? అతగాడి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

ప్రధాని మోడీ చేతలు మీదుగా రామాలయ ప్రసాదాన్ని అందుకున్న వ్యక్తి ఒక దళితుడు కావటం విశేషం. ఉత్తరప్రదేశ్ కు చెందిన మహాబీర్ కు ప్రధాని మోడీ ఆలయ ప్రసాదాన్ని స్వయంగా అందించారు. మరో ప్రత్యేకత ఏమంటే.. లడ్డూ ప్రసాదంతో పాటు.. రామచరిత మానస్ పుస్తకాన్ని.. తులసిమాలను అందజేశారు.

గతంలో ఈయనకు ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా ఇంటిని పొందారు. అంతేకాదు.. గతంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ వ్యక్తి ఇంటికి వెళ్లి భోజనం చేశారు. ఇలా తరచూ బీజేపీ అధినాయకత్వానికి బాగా పరిచయస్తుడైన దళితుడికి ప్రధాని చేతుల మీదుగా ప్రసాదాన్ని తీసుకునే అవకాశం లభించిందని చెప్పక తప్పదు.