Begin typing your search above and press return to search.

షాకు జలక్.. ఎన్నార్సీ పై మోడీ పీచేముడ్..

By:  Tupaki Desk   |   23 Dec 2019 9:42 AM GMT
షాకు జలక్.. ఎన్నార్సీ పై మోడీ పీచేముడ్..
X
పౌరసత్వ రణం కొనసాగుతోంది. రాబోయేది ఎన్ఆర్సీ మంట.. మరి త్వరలోనే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) బిల్లు తెస్తామని స్వయంగా కేంద్ర హోమంత్రి అమిత్ షా ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం సందర్భంగా లోక్ సభలోనే అమిత్ షా ఈ ప్రకటన చేశారు.

అయితే ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టంలో హిందువులు, సిక్కులకే మాత్రమే పౌరసత్వం ఇచ్చి ముస్లింలకు ఇవ్వక పోవడంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు పెచ్చరిల్లుతున్నాయి.. ఇప్పుడు ఎన్ఆర్సీ కూడా చట్టంగా మారితే పౌరులంతా తాము భారతీయులమని ఆధారాలు చూపించాలి. చూపించని వారిని గుర్తించి దేశం నుంచి పంపిస్తారు. ఇప్పటికే అస్సాంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు, హిందువులు, ఇతర మతస్థులను గుర్తించి లక్షలాది మందిని శిబిరాల్లో ఉంచారు. పౌరసత్వ సవరణతో ఇందులో హిందువులు, సిక్కులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ముస్లింల పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఈ కఠిన చట్టంతో పక్కదేశాల నుంచి వచ్చిన ముస్లింలు ఇతర ఆధారాలు లేని హిందు, సిక్కులు కూడా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది.

పౌరసత్వం, ఎన్నార్సీ రెండు చట్టాలు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నాయని.. పౌరసత్వం లేనివాళ్లకు శరాఘాతమని అంతా ఆందోళన చేస్తున్న వేళ ప్రధాని మోడీ వారిని శాంతించే ప్రకటన చేశారు. ఢిల్లీ సభలో మోడీ ఎన్ఆర్సీపై వెనక్కి తగ్గారు. అసలు ఎన్నార్సీ గురించి తాము కేబినెట్ లో చర్చించలేదని.. ఆ బిల్లు తెచ్చే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లింలు, ఇతర వర్గాలకు విడమర్చి చెప్పి వేడుకున్నారు. వదంతులు నమ్మవద్దని కోరారు.

అయితే పార్లమెంట్ లోనే అమిత్ షా చేసిన ప్రకటన తర్వాత జార్ఖండ్ లోనూ ఇటీవల ఎన్నార్సీ తెస్తామని అమిత్ షా ప్రకటించారు. కానీ తాజాగా మోడీ మాటలకు విశ్వసనీయత లేకుండా పోయింది. దీన్ని బట్టి ఎన్నార్సీపై బీజేపీ వెనకడుగు వేస్తోందని అర్థమవుతోంది. మోడీ, అమిత్ షాలు చేసిన ఈ భిన్నమైన ప్రకటనతో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయా? లేదా ఎన్నార్సీపై బీజేపీ వెనక్కి తగ్గిందా అనేది తేలాల్సి ఉంది.