Begin typing your search above and press return to search.

జోబిడెన్ కమలాహారిస్ కు ప్రధాని మోడీ అభినందనలు

By:  Tupaki Desk   |   8 Nov 2020 9:30 AM IST
జోబిడెన్ కమలాహారిస్ కు ప్రధాని మోడీ అభినందనలు
X
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన అమెరికా ఎన్నికల్లో ఎట్టకేలకు జోబిడెన్-కమలాహ్యారిస్ ద్వయం గెలవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. ట్రంప్ ఓటమి చవిచూశారు. ఈ క్రమంలోనే ఈ డెమొక్రటిక్ నేతలకు ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతుతన్నాయి.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబిడెన్ కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ‘అద్భుత విజయం సాధించిన బైడెన్ కు అభినందనలు. వైస్ ప్రెసిడెంట్ గా అమెరికా-భారత్ సంబంధాల కోసం మీ సహకారం అమూల్యమైనది. ఇండో-యూఎస్ సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా’ అని బైడెన్ తో మోడీ దిగిన పాత ఫొటోను ట్వీట్ చేశారు.

అమెరికా ఉపాధ్యక్షరాలిగా ఎన్నికైన భారత సంతతి మహిళా కమలాహారిస్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడి శుభాకాంక్షలు తెలిపారు. 'మీ విజయం అందరికీ మార్గదర్శం..ఈ గెలుపు మీకే కాదు ఇండియన్‌ అమెరికన్లందరిది. మీ గెలుపుతో అమెరికా, భారత్‌ సత్సంబంధాలు మరింత మెరుగుపడుతాయని ఆశిస్తున్నాం' అని ట్విట్టలో మోదీ ట్వీట్‌ చేశారు.

కాగా కమలా హారిస్‌ గెలుపుతో అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా రికార్డు సాధించారు. అలాగే తొలి నల్లజాతీయురాలు కూడా ఆమెనే కావడం గమనార్హం. డెమొక్రటిక్‌ పార్టీ తరుపున బరిలో ఉండడంతో ప్రవాస భారతీయ ఓట్లు ఎక్కువగా ఆ పార్టీకే పడ్డట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడులోని ఆమె తల్లి సొంతూరులో స్థానికులు సంబరాలు నిర్వహించుకున్నారు.