Begin typing your search above and press return to search.
ఏపీ ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోటీసులు.. ఏ విషయంలో?
By: Tupaki Desk | 13 Jan 2021 11:28 AM ISTఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తాజాగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోటీసులు పంపింది. ఏపీలోని మీడియా అక్రిడేషన్ కమిటీల ఏర్పాటు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు.. మార్గదర్శకాలకు విరుద్దంగా ఉండటమే కారణమని చెబుతున్నారు. ఈ అంశాన్ని సుమోటాగా తీసుకున్న సంస్థ.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు.
2014లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అక్రిడేషన్ మార్గదర్శకాల్ని విడుదల చేసింది. వీటిల్లో కొన్నింటిని మార్పులుచేస్తూ 2019లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా లేదని చెబుతున్నారు. ఎందుకంటే.. మార్గదర్శకాల్లోకొన్నింటిని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా.. అక్రిడేషన్ కమిటీల్లో గుర్తింపు పొందిన ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన సభ్యుల ప్రాతినిధ్యం ఉండాలని గుర్తు చేస్తున్నారు. అయితే.. ఈ నిబంధనను ఏపీ సర్కారు మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు జర్నలిస్టు సంఘాల వారు ఫిర్యాదు చేయటంతో.. తాజాగా నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. మరి.. ఈ విషయంపై ప్రభుత్వం ఏ రీతిలో స్పందిస్తుందో చూడాలి.