Begin typing your search above and press return to search.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌.. సీఎం జ‌గ‌న‌కు గిరిజ‌నుల నిల‌దీత‌!

By:  Tupaki Desk   |   26 Jun 2022 2:30 AM GMT
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌.. సీఎం జ‌గ‌న‌కు గిరిజ‌నుల నిల‌దీత‌!
X
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు రంగం సిద్ధ‌మైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే త‌ర‌ఫున గిరిజ‌న నాయ‌కురాలు.. మాజీ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌దీ ముర్మును ఎంపిక చేశారు. ఇక, విప‌క్ష కూట‌మి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హాను ఎంపిక చేశారు. అయితే.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక విష‌యంలో ఆది నుంచి గుంభ‌నంగా వ్య‌వ‌హ‌రించిన ఏపీ స‌ర్కారు.. అనూహ్యంగా చివ‌రి నిముషంలో ద్రౌప‌దీ ముర్ముకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఆమె నామినేష‌న్ దాఖ‌లు కార్య‌క్ర‌మానికి వైసీపీ ఎంపీ సాయిరెడ్డి హాజ‌రై.. మ‌ద్ద‌తు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి స‌హా వైసీపీ అదిష్టానం.. ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసింది. గిరిజ‌న ఆదివాసీ నాయ‌కురాలికి.. రాష్ట్ర‌ప‌తిగా అవ‌కాశం క‌ల్పించ‌డం స్వాతంత్య్ర భార‌త చ‌రిత్ర‌లో తొలిసారి.. అని కొనియాడింది. అంతేకాదు.. ఈ ఎంపిక గిరిజ‌నుల అభ్యున్న‌తికి ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని.. పేర్కొంది. క‌ట్ చేస్తే.. నిజంగానే ఈ ఎంపిక గిరిజ‌నుల‌కు ఉప‌యుక్త‌మో కాదో తెలియ‌దుకానీ.. ఒక గిరిజ‌న వ్య‌క్తికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై.. వైసీపీపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఎందుకంటే.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక విష‌యంలో ఎన్డీయే కూట‌మికి ఉన్న 48.68 శాతం ఓట్లు స‌రిపోవు. ఈ నేప‌థ్యంలో బీజేపీ సానుకూల పార్టీలు.. మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం ఉంది. దీనికి వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేలు.. ఎంపీల సంఖ్య అయితే.. స‌రిపోతుంది. కానీ, వైసీపీ ఎన్డీయే కూట‌మిలోలేదు. కానీ, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక విష‌యంలో మాత్రం కీల‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలో దీనిని అడ్డు పెట్టుకుని ప్ర‌త్యేక హోదా సాధించాల‌ని కొన్నాళ్లుగా వైసీపీపై తీవ్ర‌మైన ఒత్తిడి వ‌స్తోంది.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల నుంచి మేధావుల వ‌ర‌కు కూడా.. ఇదే విష‌యాన్ని నొక్కి చెప్పారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక స‌మ‌యంంలో జ‌గ‌న్ క‌నుక మొండి ప‌ట్టుప‌డితే.. కేంద్రం త‌నంత‌ట త‌ను దిగి వ‌స్తుంద‌ని.. కాబ‌ట్టి ఈ సం దర్భంగా అయినా.. హోదా స‌హా.. ఇత‌ర డిమాండ్లు సాధించాల‌ని సూచించారు. కానీ, ఈ విష‌యాలను ఏవీ ప‌ట్టించుకోకుండానే.. వైసీపీ అధిష్టానం.. ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలోనే వైసీపీపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో మీ వందల ఓట్లేసి ఒక్క గిరిజన వ్యక్తికి లాభం చేస్తారా? ప్రత్యేక హోదా సాధించి ఏపీలో ఉన్న లక్షలాది మంది గిరిజనులకు భవిష్యత్తు ఇస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు మేధావులు. ఈ విష‌యంలో జ‌గ‌న్ రెడ్డి నిర్ణ‌యించుకోవాల‌ని.. డిమాండ్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతానికి మ‌ద్ద‌తు ఇచ్చినా.. ఇప్ప‌టికీ డిమాండ్లు సాధించుకునేందుకు స‌మ‌యం ఉంద‌ని.. కాబ‌ట్టి.. రాష్ట్రంలో కీల‌క‌మైన 2.5 శాతం ఓటు బ్యాంకుగా ఉన్న గిరిజ‌నుల కోసం.. అయినా.. వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునైనా.. జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకోవాల‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.