Begin typing your search above and press return to search.

#RussiaUkrainewar: యుద్ధ ఘోరాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉక్రెయిన్

By:  Tupaki Desk   |   24 Feb 2022 1:30 PM GMT
#RussiaUkrainewar: యుద్ధ ఘోరాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉక్రెయిన్
X
అగ్రరాజ్యం రష్యా యుద్ధం ప్రకటించడంతో బాధిత ఉక్రెయిన్ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే సగభాగాన్ని రష్యన్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు బోలోడిమిర్ జెలెన్ స్కీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ జాతిని,. రష్యా ప్రజలను ఉద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.

'మా గొంతుకను వినండి.. ఉక్రెయిన్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. ఉక్రెయిన్ అధికారులు శాంతిని కాంక్షిస్తున్నారు. మాకు యుద్ధం ఏమాత్రం అవసరం లేదు' అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సహా పలు దేశాలు రష్యా చర్యను ఖండించాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ వీడియోలో ఎమోషనల్ అయ్యారు. 'తాము యుద్ధం కోరుకోవడం లేదని.. అయితే తమను తాము రక్షించుకునే క్రమంలో ప్రతిదాడి చేస్తామని స్పష్టం చేశారు.

'యుద్ధం అంటే బాధ, బురదలో కూరుకుపోవడం.. రక్తపాతం, వేలాది మంది మరణాలు, మాపై దాడి చేయడం ద్వారా మమ్మల్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. మేము మాత్రం యుద్ధం కోరుకోవడం లేదు' అని రష్యన్ భాషలో ప్రసగించారు. మనం శత్రువులం కాదు.. అయితే ఆత్మరక్షణలో భాగంగా మేము కూడా ప్రతిదాడి చేయాల్సి ఉంటుంది అని ఉక్రెయిన్ అధ్యక్షుడు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ఉక్రెయిన్ కు మద్దతు పెరుగుతోంది. అధ్యక్షుడి శాంతిపూర్వక ఎమోషనల్ వీడియోకు అందరూ ప్రశంసిస్తున్నారు. ఆయన ప్రసంగం హృదయాలను కదలించిందని.. శాంతిని కోరుకునే తత్వంతో చరిత్రలో నిలిచిపోతారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇఫ్పుడు సోషల్ మీడియాలో 'స్టాండ్ విత్ ఉక్రెయిన్' అంటూ ఆ దేశానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. మరోవైపు బ్రిటన్, ఫ్రాన్స్, ఉక్రెయిన్ కే మద్దతు ప్రకటించారు. తాను ప్రపంచ దేశాధినేతలతో చర్చలు జరుపుతున్నానన్న జెలెన్ స్కీ తమకు అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.