Begin typing your search above and press return to search.
కేంద్ర విద్యా శాఖ పేరుకు రాష్ట్రపతి కోవింద్ ఆమోదం !
By: Tupaki Desk | 18 Aug 2020 10:45 AM ISTకేంద్రం మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తాజాగా ఆమోదం తెలిపారు. దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం ఉండబోతుంది. ఇస్రో మాజీ చీఫ్ కే కస్తూరిరంగన్ సారథ్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ తొలుత మంత్రిత్వ శాఖ పేరు మార్చాలని చెప్పగా నూతన విద్యా విధానం డ్రాఫ్ట్ లో ఇది కీలక సిఫార్సు కావడంతో పేరు మార్పునకు ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
భారత ప్రభుత్వ నిబంధనలు-1961లోని మొదటి, రెండు షెడ్యూల్స్ లో ఉన్న ‘మానవ వనరుల అభివృద్ధి శాఖ’ పేరును ‘విద్యా శాఖ’గా మారుస్తున్నట్లు వివరించారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విద్యాశాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చారు. తాజాగా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం..మంత్రిత్వ శాఖ పేరును కూడా మార్చేందుకు నిర్ణయించింది.