Begin typing your search above and press return to search.

అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన రాష్ట్రపతి హెల్త్ బులిటెన్ విడుదల

By:  Tupaki Desk   |   26 March 2021 4:02 PM IST
అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన రాష్ట్రపతి హెల్త్ బులిటెన్ విడుదల
X
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆసుపత్రి పాలయ్యారు. శుక్రవారం ఉదయం ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ఛాతీలో తనకు అసౌకర్యంగా ఉందని చెప్పడంతో సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రస్తుతం రామ్ నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందనీ, అబ్జర్వేషన్లో ఉంచామని వైద్యులు వెల్లడించారు.

కొన్ని సాధారణ పరీక్షలను మాత్రం నిర్వహించాల్సి ఉంటుందని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఓ హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. రామ్ నాథ్ కోవింద్ ఆసుపత్రి పాలయ్యారన్న వార్త తెలిసి కేంద్ర ప్రముఖులు ఆరా తీశారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు వైద్యులు వివరించారు. కోవింద్ ఆరోగ్య పరిస్థితి గురించి బులిటెన్ విడుదల చేశారు.

ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ను రాష్ట్రపతి వేయించుకున్న విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్చి 3న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు వేయించుకున్నారు. మార్చి 8న ఆయన సతీమణి, ప్రథమ మహిళ సవితా కోవింద్‌ కూడా టీకా తీసుకున్నారు.