Begin typing your search above and press return to search.

రాష్ట్ర‌ప‌తి : బీజేపీ ప్రోత్స‌హించిన ద‌క్షిణాది నేత‌లు వీళ్లే !

By:  Tupaki Desk   |   23 Jun 2022 4:30 PM GMT
రాష్ట్ర‌ప‌తి : బీజేపీ ప్రోత్స‌హించిన ద‌క్షిణాది నేత‌లు వీళ్లే !
X
ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఎవ‌రిని ఎంపిక చేయాలి అన్న మీమాంస అయితే లేకుండా పోయింది.బీజేపీ కూట‌మి ప‌రంగానే కాదు బిజూ జన‌తాద‌ళ్ పార్టీ (కూట‌మిలో లేని పార్టీ) కి కూడా ఆనందం ఇచ్చేలా బీజేపీ త‌నదైన శైలిలో ద్రౌప‌దీ ముర్మూ పేరుతో తెర‌పైకి వ‌చ్చింది. ఆమె బీఏ వ‌ర‌కూ చ‌దువుకున్నా, బీజేపీలో ఏనాటి నుంచో క్రియాశీల‌కంగా ప‌నిచేస్తున్నారు. ఒడిశా టీచ‌రమ్మ‌గా మంచి గుర్తింపు పొంది ఉన్నారు.

సంథాలీ అనే గిరిజ‌న తెగ‌కు చెందిన అతి నిరాడంబ‌ర మ‌హిళ‌ను బీజేపీ ఎంపిక చేయ‌డంపై అన్నింటా ఆమోదం వ‌స్తున్నా విప‌క్షంలో ఓ వ‌ర్గం మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ద‌క్షిణాదికి ప్రాధాన్యం అన్న‌ది లేకుండా పోయింద‌ని నిన్న‌టి నుంచి వెక్కి వెక్కి ఏడుస్తుంద‌ని బీజేపీ అంటోంది. మ‌రీ ! అంత‌గా ఏడ్వాల్సిన ప‌నేమీ లేద‌ని, తాము అన్నింటినీ దృష్టిలో ఉంచుకునే అభ్య‌ర్థి ఎంపిక చేశామని బీజేపీ అంటోంది.

ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుకు దేశ రాజ‌ధానిలో అవ‌మానం జరిగిపోయిందంటూ ఓ వ‌ర్గం రాజ‌కీయ గ‌ణం ప్ర‌చారం చేయ‌డంపై బీజేపీ మండిప‌డుతోంది. ద‌క్షిణాదిలో ఇప్ప‌టికే ఎంద‌రెంద‌రినో బీజేపీ నాయ‌క‌త్వం ప్రోత్స‌హించిందంటూ ఓ జాబితానే తెర‌పైకి తెచ్చింది. వెంక‌య్య ఆ ప‌ద‌విని మొద‌టి నుంచి కోరుకోలేద‌ని, తాను బ‌రిలో ఉంటాన‌ని కూడా త‌మ‌కు చెప్ప‌లేద‌ని, మాట మాత్రంగా కూడా చెప్ప‌ని వాటిని తాము ఎలా ప‌రిగ‌ణిస్తామ‌ని అంటూ బీజేపీ అధినాయ‌క‌త్వం త‌న అభిప్రాయాన్ని చెబుతోంది.

తాము మొద‌టి నుంచి పదవుల కేటాయింపులో ప్రాంతాల మ‌ధ్య స‌మ‌తుల్య‌త అన్న‌ది పాటించామ‌ని కూడా అంటోంది. విద్యార్థి రాజ‌కీయాల నుంచి ఎదిగివ‌చ్చిన వెంక‌య్యనే కాదు ఇంకా చాలామందిని తాము అత్యున్న‌త స్థాయిలో ఉంచామ‌ని కూడా వివ‌రిస్తోంది.

బంగారు ల‌క్ష్మ‌ణ్ మొద‌లుకుని విద్యా సాగ‌ర్ వ‌ర‌కూ తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారిని, తెలుగు ప్రాంతాల‌తో అనుబంధం ఉన్న‌వారిని సైతం (ఉదాహ‌ర‌ణ : నిర్మ‌లా సీతారామ‌న్, ఆమె తెలుగింటి కోడలు, స్వ‌స్థ‌లం : మ‌ధురై) ప్రోత్స‌హించామ‌ని వివ‌రిస్తోంది. క‌నుక ప‌ద‌వుల కేటాయింపుల్లో ఎటువంటి వివ‌క్ష కూ తావే లేద‌ని అంటోంది. కేవ‌లం రాజ‌కీయం చేయాల‌న్న తలంపుతోనే కొన్ని విప‌క్ష పార్టీలు నానా రాద్ధాంతం చేస్తున్నాయని మండిప‌డుతోంది.

1) బంగారు లక్ష్మణ్ - జాతీయ అధ్యక్షులు, రైల్వే కేంద్రమంత్రి
2) సుశీల (లక్షణ్ భార్య) - ఎం.పీ రాజస్థాన్ నుండి
3) వెంకయ్య నాయుడు - పార్టీ జాతీయ అధ్యక్షులు,
అనేక సార్లు రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి, ఉప రాష్ట్రపతి
4) ఆలే నరేంద్ర - ఒకసారి ఎంపీ
5) బండారు దత్తాత్రేయ - పలుమార్లు ఎంపీ,రెండు సార్లు, కేంద్రమంత్రి, ప్రస్తుతం హరియాణా గవర్నర్
6) కంభంపాటి హరిబాబు - మిజోరాం గవర్నర్
7) నిర్మల సీతారామన్ - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
8) జి.వి.ఎల్ నరసింహ రావు - రాజ్యసభ సభ్యుడు
9) సత్య కుమార్ - జాతీయ కార్యదర్శి , యూపీ సీఎం యోగీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త
10) మురళీధర్ రావు - మధ్య ప్రదేశ్ ఇంచార్జి, మాజీ పార్టీ ప్రధాన కార్య దర్శి
11) విద్యా సాగర్ రావు - మహారాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రి
12) ఆచారి తాల్లోజు - జాతీయ బి.సి.కమిషన్ సభ్యులు
13) కె.లక్ష్మణ్ - జాతీయ బి.సి.సెల్ అధ్యక్షులు రాజ్యసభ ఎం.పి.
14) కిషన్ రెడ్డి - ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించి రెండు సార్లు కేంద్ర మంత్రి పదవినిచ్చింది.
15) వి. రామారావు - సిక్కీం గవర్నర్
16) షెహజాదీ - మైనార్టీ కమిషన్ మెంబర్