Begin typing your search above and press return to search.

2013లోనే కరోనా..ఎందుకు వ్యాప్తి చెందలేదు

By:  Tupaki Desk   |   28 March 2020 8:10 AM GMT
2013లోనే కరోనా..ఎందుకు వ్యాప్తి చెందలేదు
X
ఏడేళ్ల కిందటనే కరోనా వైరస్‌ ఉంది. ఆ కరోనా బారిన అప్పుడే ఆరుగురు మృతిచెందారు. అయితే అప్పుడు కరోనా కలవరం రేపినా అది తీవ్ర రూపం దాల్చలేదు. ప్రస్తుతం బ్రిటన్ - ఇటలీ - అమెరికా కరోనా బారిన సతమతమవుతున్నా 2013లో మాత్రం బ్రిటన్‌ లో వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌లోని బర్మింగ్‌ హమ్‌లో ఆరుగురు మృతిచెందారు. అయితే అప్పుడు ఆ వైరస్‌ కనిపించినా అంతగా వ్యాప్తి చెందలేదు. కొన్నాళ్లకు ఆ వైరస్‌ కనుమరుగై 2019 మధ్యకాలంలో వ్యాపించి ప్రస్తుం 2020 మార్చికు వచ్చేసరికి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. అయితే కరోనా 2013లోనే ఉంది అనే వార్తలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారాయి.

అప్పుడు వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌ ఎందుకు తీవ్ర రూపం దాల్చలేదు... ఇప్పుడు ఎందుకు ఇంతలా వ్యాపిస్తోందని ప్రజలతో పాటు పరిశోధకులు - వైద్యులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి పరిస్థితులు వైరస్‌ ఎదుగుదలకు దోహదం చేయలేదా? లేక అప్పట్లోనే ఆ వైరస్‌ను నియంత్రించడంతో వ్యాప్తి చెందలేదా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రస్తుత 2019 వైరస్‌ వెలుగులోకి వచ్చినా కట్టడికి సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే వెలుగులోకి వచ్చిందని కొందరు పేర్కొంటున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందిన సమయంలో నిర్లక్ష్యం చేయడం.. అప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులు వైరస్‌ వ్యాప్తికి దోహదం చేశాయని శాస్త్రవేత్తలు - పరిశోధకులు చెబుతున్నారు.

కరోనా వైరస్‌ ప్రస్తుతం ఇంతలా వ్యాప్తి చెందడానికి గల కారణం ఈ వైరస్‌ బహిర్గతమైన సమయంలోనే పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడమే కారణంగా పేర్కొంటున్నారు. చైనాలోని వ్యూహాన్‌ లో ఈ వైరస్‌ బహిర్గతమైన సందర్భంలో అధికార యంత్రాంగం - ఆ దేశం నిర్లక్ష్యం చేయడంతోనే ప్రస్తుతం ఈ పరిణామాలకు దారి తీశాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2013లో బ్రిటన్‌ లో వెలుగులోకి వచ్చిన సమయంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతోనే అప్పుడు ఆ వైరస్‌ కట్టడికి వచ్చిందని చెబుతున్నారు. అప్పుడు కనుమరుగైన ఆ వైరస్‌ ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని ప్రారంభంలోనే పటిష్టమైన జాగ్రత్తలు - చర్యలు తీసుకుని ఉంటే ఆ వైరస్‌ వ్యాప్తి చెంది ఉండేది కాదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.