Begin typing your search above and press return to search.
పాట్నా క్వారంటైన్ సెంటర్ లో 'పంతులు డ్యాన్స్' ..
By: Tupaki Desk | 9 Jun 2020 5:00 AM ISTప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ మహమ్మారితో పోరాడుతోంది. అది ప్రాణాంతకమని, ఒకరు వైరస్ బారిన పడితే తెలియకుండా మిగతా వారికి అంటుకుంటుందని అందరూ భయపడిపోతున్నారు. అయితే దాన్ని ధైర్యంతో జయించవచ్చని నిపుణులు చెప్తున్నారు. దీంతో క్వారంటైన్ సెంటర్ లో ఉన్న వాళ్లు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. అయితే, ప్రాణాంతకమైన వ్యాధి ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తూ ఎలా ఉండాలి అని అనుకోవచ్చు ..కానీ , ఈ వ్యాధి కి సరైన వ్యాక్సిన్ లేదు ..ఓ మనిషి మనో ధైర్యమే వ్యాధి నయం కావడానికి సహాయపడుతుంది. కాబట్టి ..పౌష్ఠిక ఆహారం తీసుకోని ..బలంగా ఉండే ఈ మహమ్మారి ఏమీ చేయలేదు.
అయితే , ఈ మహమ్మారి భారిన పడిన వారిని ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ ఉంచుతుంది. ఆలా పాట్నాలో క్వారంటైన్ సెంటర్లో ఉన్న ఓ పంతులు డ్యాన్స్ ఇరగదీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బిహార్ కతిహార్ లోని క్వారంటైన్ సెంటర్ లో తోటి వారిని ఉత్సాహపర్చడానికి ఆ వ్యక్తి 1967 నాటి ‘పడోసాన్’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఏక్ చతుర్ నార్’ పాటకు డ్యాన్స్ చేశాడు.
బనీను - ధోతి ధరించి మెహమూద్ ను అనుకరిస్తూ డ్యాన్స్ చేశాడు. పాటలోని ప్రతి అర్దానికి తగినట్లుగా హావభావాలు పలికిస్తూ అద్భుతంగా డ్యాన్స్ చేసాడు. క్వారంటైన్ సెంటర్ లోని జనాలు చప్పట్లు కొడతూ అతడిని ఉత్సాహపరిచారు. అతడి ప్రయత్నం విజయవంతం అయ్యింది. అయన డ్యాన్స్ చూసిన నెటిపజనులు డ్యాన్స్ కు ఫిదా అయ్యారు. సూపర్ భయ్యా అంటూ ప్రశంసిస్తున్నారు.