Begin typing your search above and press return to search.

తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో ఊడిన పెచ్చులు ..మహిళా మృతి , పలువురికి గాయాలు !

By:  Tupaki Desk   |   5 Oct 2020 11:45 AM IST
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో ఊడిన పెచ్చులు ..మహిళా మృతి , పలువురికి గాయాలు !
X
తిరుపతి స్విమ్స్ కరోనా స్పెషల్ కేర్ హాస్పిటల్ లో ఆస్పత్రిలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణ సంస్థలు చేసిన తప్పులకి ఓ నిండు ప్రాణం పోయింది. కొత్తగా నిర్మిస్తున్న భవనం పెచ్చులు ఊడి మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాలు.. కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనం గ్రౌండ్, మొదటి అంతస్థును కరోనా వార్డుగా ఉపయోగిస్తున్నారు. పైన మూడంతస్థుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఆదివారం రాత్రి నిర్మాణంలో ఉన్న బిల్డిండ్ పెచ్చులు పడి విధి నిర్వణలో ఉన్న మహిళపై పడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే రాధికను అంబులెన్స్ ‌లో స్విమ్స్ అత్యవసర విభాగానికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఇప్పటివరకు అదే హాస్పిటల్ లో ఎంతోమంది కరోనా భాదితులకు సేవలు చేసిన ఆమె , అదే హాస్పిటల్ లో అకారణంగా కన్నుమూశారు. అయితే , మరణించిన రాధిక ప్రస్తుతం ఆరు నెలల గర్భిణీ అని తెలుస్తుంది.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఘటన స్థలానికి చేరుకుని సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారికి కరోనా వార్డులోనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రమాద స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని.. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, పెచ్చులు ఊడిపడిన సమయంలో పెద్ద ఎత్తున శబ్దం వచ్చిందని అక్కడున్నవారు చెబుతున్నారు.