Begin typing your search above and press return to search.
బిడ్డ ప్రసవించకుండానే మళ్లీ ప్రెగ్నెన్సీ.. లండన్ లో వింత!
By: Tupaki Desk | 13 Feb 2021 7:00 AM ISTమహిళ గర్భంతో ఉండగానే.. ఆ బిడ్డ జన్మించకుండానే.. మరోసారి గర్భం దాల్చిందో మహిళ! ఇంగ్లాండ్‌లోని ట్రౌబ్రిడ్జ్‌లో ఈ వింత ఘటన వెలుగు చూసింది. ఆ నగరంలో నివసిస్తున్న రెబక్కా రాబర్ట్స్ అనే 39 ఏళ్ల మహిళకు ఈ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. గత సెప్టెంబరులో ప్రసవం కూడా జరిగింది. మరి, ఏమైంది? ప‌్రసవం జరిగిందా? ఆ వివరాలు చూద్దాం..
రెబక్కా రాబర్ట్స్ కు 39 ఏళ్ల వయసు. ఆమె భర్త రైస్ వీవర్ వయసు 43ఏళ్లు. వారికి అప్పటికే సమ్మర్ అనే 14 ఏళ్ల కూతురు ఉంది. చాలా కాలం తర్వాత ఈ మధ్యనే రెబెక్కా మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యింది. తాను గర్భం ధరించిన మొదట్లో వైద్యులు స్కానింగ్ చేయగా.. గర్భంలో ఒక్క బిడ్డే ఉంది. రెండు దఫాలుగా స్కానింగ్ చేయించుకున్నప్పటికీ.. ఒక్కబిడ్డే ఉంది. కానీ.. మూడు వారాల తరువాత మరోసారి స్కాన్ చేయించుకోగా.. అప్పుడు.. రెండో బిడ్డ కూడా ఉందని రిపోర్టు వచ్చింది.
దీంతో.. ఆమెతోపాటు డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. కేవలం మూడు వారాల్లో మరో బిడ్డ ఎలా రూపుదిద్దుకుంటుందని ఆశ్చర్యపోయారు. అయితే.. ఈ పరిస్థితిని వైద్యపరిభాషలో 'సూపర్ఫెటేషన్' లేదా 'డబుల్ ప్రెగ్నెన్సీ' అంటారట. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే.. గర్భం కోసం మందులు వాడినప్పుడు ఇలా జరుగుతుందని తేల్చారు వైద్యులు.
ఎలా జరుగుతుందో? ఏమవుతుందో? అని ఆందోళన కొనసాగుతూ వచ్చింది. కానీ.. 2020 సెప్టెంబరు నెలలో రెబెక్కా కవల పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో ఒకరు మగ బిడ్డ కాగా.. మరొకరు ఆడబిడ్డ. వీరిలో ఆడ బిడ్డ కాస్త బరువు తక్కువగా ఉండడంతో కొద్దిరోజులు హాస్పిటల్‌లో ఉంచారు. ఎట్టకేలకు డిసెంబరు 25న చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. ఇది వైద్య రంగలోనే అద్భుతంగా భావిస్తున్నారు డాక్టర్లు.