Begin typing your search above and press return to search.

వాలంటైన్స్‌ డే: వీహెచ్‌ పీ స్పెష‌ల్ ఆఫర్‌

By:  Tupaki Desk   |   12 Feb 2018 1:37 PM GMT
వాలంటైన్స్‌ డే: వీహెచ్‌ పీ స్పెష‌ల్ ఆఫర్‌
X
వాలంటైన్స్ డే అంటేనే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది..ప్రేమ జంట‌ల సంబురాలు. అదే స‌మ‌యంలో వీహెచ్‌పీ హ‌ల్‌చ‌ల్ చేయ‌డం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్ డేకి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్(VHP), భజరంగ్ దళ్ కార్యకర్తలు ర్యాలీలు - నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాశ్చాత్య విష సంస్కృతి భారతీయ సంస్కృతి - సంప్రదాయాలకు వ్యతిరేకమని దీన్ని నిషేధించాలని డిమాండ్ కూడా చేస్తున్నాయి. అయితే విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ఈ వాలంటైన్స్‌ డేకు ప్ర‌త్యేక ఆఫ‌ర్ ఒక‌టి ప్ర‌క‌టించారు.

ఎప్పుడూ ప్రేమికులరోజు జరుపుకోవద్దని చెప్పే తొగాడియా ఈ సారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేమికులకు ఆశ్చర్యం కలిగించేలా వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమికుల రోజు సందర్భంగా విశ్వహిందూ పరిషత్ - భజరంగ్ దళ్ కార్యకర్తలను ఉద్దేశించి చండీఘ‌డ్‌ లో ఆయన ప్రసంగించారు. యువతీ యువకులు ప్రేమలో పడకపోతే పెళ్లిళ్లు జరగవని...ఒక వేళ వివాహాలు జరగకపోతే ప్రపంచం పురోగమించదన్నారు. యుక్త వయస్సులో ఉన్న యువతీ యువకులకు ప్రేమించుకునే హక్కు ఉందన్నారు. మన కూతుళ్లు - సోదరీమణులకు ప్రేమించుకునే హక్కు ఉందనే మెసేజ్ ను ప్రచారం చేస్తానని తొగాడియా ఆస‌క్తిక‌ర‌మైన రీతిలో స్పందించారు.