Begin typing your search above and press return to search.

శాఖ‌మీద ప‌ట్టులేని మంత్రి..వెంక‌య్య‌కు వ‌త్తాసా..!

By:  Tupaki Desk   |   10 Aug 2015 3:41 PM GMT
శాఖ‌మీద ప‌ట్టులేని మంత్రి..వెంక‌య్య‌కు వ‌త్తాసా..!
X
ప్ర‌త్తిపాటి పుల్లారావు..గుంటూరు జిల్లా నుంచి చంద్ర‌బాబు కేబినెట్‌ లో ల‌క్‌ గా బెర్త్ ద‌క్కించుకున్నారు. అక్క‌డ న‌రేంద్ర‌, కోడెల వంటి వాళ్లు ఉన్నా చంద్ర‌బాబు జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా బాగా ప‌ని చేశార‌న్న న‌మ్మ‌కంతో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. అయితే ప్ర‌త్తిపాటి మాత్రం కీల‌క‌మైన వ్య‌వ‌సాయ‌శాఖ నిర్వ‌హిస్తున్నా ఎన్నో సార్లు మీడియా ముందు ఆయ‌న శాఖ స‌మాచారం చెప్పేందుకే త‌డ‌బ‌డ్డారు. చంద్ర‌బాబు వ‌ద్ద కేబినెట్ మీటింగ్‌ ల‌లో కూడా స‌రైన గ‌ణాంకాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో బాబుతో చీవాట్లు తిన్నారు.

అలాంటి పుల్లారావు ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం మునికోటి లాంటి వాళ్లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డం చాలా బాధాక‌ర‌మ‌ని... ఇక‌పై ఎవ్వ‌రు ఇలా ఆత్మ‌హ‌త్య‌ ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని సూచించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు కూడా ఎవ్వ‌రు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్ద‌ని చెపుతున్నార‌ని వెన‌కేసుకొచ్చారు. ఇదేం లాజిక్కో అర్థం కావడం లేదు.

ప్ర‌త్యేక హోదా కోసం చంద్ర‌బాబు ఈ నెల 16న మోదీని క‌లుస్తున్నార‌ని..ప్ర‌త్యేక హోదా రాక‌పోతే ఆ హోదాకు త‌గిన‌ట్టుగా నిధులు డిమాండ్ చేస్తామంటూ చావుక‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రం ఆలోచిస్తోంద‌ని కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామ‌న్ లాంటి వారు చెపుతున్నార‌ని... ప్ర‌ధాన‌మంత్రి దీనిపై ఓ స్ప‌ష్ట‌త ఇచ్చి ఉంటే బాగుండేద‌ని పుల్లారావు ప‌రోక్షంగా అటు బీజీపీ పై త‌న అవ్యాజ ప్రేమ‌ను చాటుకున్నారు. మరి ఆయనకు బీజేపీ ఏం మందు పెట్టిందో!

ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ చేసిన అన్యాయంపై ప్ర‌తి ఒక్క ఆంధ్రుడు గొంతు చించుకుని విరుచుకుప‌డుతుంటే ...ఇంకా పుల్లారావు ఏ ఉద్దేశంతో బీజేపీ నాయ‌కులు/ కేంద్రాన్ని వెన‌కేసుకొస్తున్నారో అర్థం కావ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త మ‌వుతున్నాయి. త‌న శాఖ‌పై త‌న‌కే ప‌ట్టులేని వ్య‌క్తి... క‌నీసం ప్ర‌త్యేక హోదా విష‌యంలో సీరియ‌స్‌ గా డిమాండ్ చేయ‌డం పోయి ఇలా బీజేపీ ప్ర‌భుత్వాన్ని/ కేంద్ర మంత్రుల‌ను వెన‌కేసుకు రావ‌డం శోఛ‌నీయం. మ‌రో జోక్ ఏంటేంటే ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రం ఆలోచిస్తోంద‌ని నిర్మలా సీతారామ‌న్ చెప్ప‌డం శుభ‌సూచ‌క‌మ‌ట‌. ఇలాంటి గాలి వార్త‌లు ఆంధ్రులు ఎన్ని సార్లు విన‌లేదు. మునికోటి మృతితో ఇలాంటి వారు ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌చి, వాస్త‌వాలు మాట్లాడితే బాగుంటుంద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.