Begin typing your search above and press return to search.

ఇదే గేమ్ ప్లాన్: బాబు రాడ‌ని న‌మ్మించిన పీకే!

By:  Tupaki Desk   |   7 May 2019 5:13 AM GMT
ఇదే గేమ్ ప్లాన్: బాబు రాడ‌ని న‌మ్మించిన పీకే!
X
పీకే అలియాస్ ప్ర‌శాంత్ కిశోర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. రాజ‌కీయ వ్యూహాల‌తో పాటు.. పోల్ మేనేజ్ మెంట్ విష‌యంలో అత‌డికున్న ప‌ట్టు అంతా ఇంతా కాదు. తన‌ను న‌మ్మ‌కున్న క్లయింట్ల‌కు నూటికి నూరు శాతం మేలు చేసేలా ప్లాన్ వేసే పీకే.. ఏపీలో ఏం చేశారు? వైఎస్ జ‌గ‌న్ కు ప‌రిస్థితులు సానుకూలంగా మార్చ‌టంలో ఏమైనా చేయ‌గ‌లిగారా? అన్న అంశంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

పోలింగ్ ముందు వ‌ర‌కూ పీకే ప్ర‌భావం ఏమీ లేద‌ని కొట్టి పారేసిన త‌మ్ముళ్లు.. ఇప్పుడు త‌మ వాద‌న‌ను వెన‌క్కి తీసుకుంటున్నారు. పీకేను త‌క్కువ అంచ‌నా వేసి.. భారీ న‌ష్టాన్ని కొని తెచ్చుకోనున్నామా? అన్న ప్ర‌శ్న వారిని వెంటాడుతోంది. పీకే వ్యూహాన్ని అర్థం చేసుకోవ‌టంలో తాము దారుణంగా ఫెయిల్ అయ్యామ‌ని వారిప్పుడు భావిస్తున్నారు.

పీకే వ్యూహాన్ని ఇప్ప‌డిప్పుడే క్రాక్ చేశామ‌ని చెబుతున్న వారు.. జ‌గ‌న్ గెలుపులో పీకే ప్ర‌ధాన భూమిక పోషించార‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ మీద ఉన్న నెగిటివ్ ను బాబు మీద‌కు మ‌ళ్లించ‌టంలో ఆయ‌న చ‌తుర‌త ప్ర‌ద‌ర్శించిన‌ట్లుగా వారు చెబుతున్నారు. జ‌గ‌న్ కు ఓటు వేసేందుకు వీలుగా ఆయ‌న అనుస‌రించిన విధానం త‌మ‌కు ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతుంద‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు.

ఏపీలో ఏ ఇద్ద‌రిని క‌దిలించినా.. జ‌గ‌న్ గెలిచే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంద‌ని.. ఈ టాక్ ఎలా వ‌చ్చింది? అస‌లు ఇదెప్ప‌టి నుంచి మొద‌లైంద‌న్న విష‌యంపై త‌మ్ముళ్లు లోతుల్లోకి వెళుతున్నారు. జ‌గ‌న్ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన పీకే టీం.. ఈసారి బాబు రాడు.. జ‌గ‌న్ వ‌స్తాడ‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల్లో ఒక చ‌ర్చ‌గా మార్చే విష‌యంలో స‌క్సెస్ అయ్యార‌ని.. ఒక‌సారి అవ‌కాశం ఇస్తే ఏమ‌వుతుంద‌న్న భావ‌న‌ను క‌లిగేలా చేయ‌టంతో పాటు.. సామాన్యుల్లో జ‌గ‌న్ కు అవ‌కాశం ఇవ్వాల‌న్న భావ‌న క‌లిగించ‌టంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యార‌ని చెబుతున్నారు.

బాబుకు ప్ర‌త్యేకంగా నెగిటివ్ ప్ర‌చారం లేకున్నా.. పాల‌న మీద స్ప‌ష్ట‌మైన అసంతృప్తిని చెప్ప‌లేకున్నా.. ఒక్క‌సారి జ‌గ‌న్ కు అవ‌కాశం ఇస్తే న‌ష్ట‌మేంటి? అన్న మాట ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా చేయ‌టంతో పాటు.. ఈసారి జ‌గ‌న్ గెలుపు ఖాయ‌మ‌న్న భావ‌న క‌లిగించ‌టంలో పీకే విజ‌యం సాధించార‌ని చెబుతున్నారు. బై..బై.. బాబు లాంటి కొన్ని నినాదాలు ప్ర‌జ‌ల మీద ప్ర‌భావాన్ని చూపించిన‌ట్లుగా భావిస్తున్నారు. మొత్తంగా పీకే ప్ర‌భావం లేద‌నుకున్న త‌మ్ముళ్ల‌కు షాక్ త‌గిలేలా.. ఆయ‌న వ్యూహాన్ని ఇప్పుడిప్ప‌డే అర్థం చేసుకుంటున్న‌ట్లుగా వారు చెబుతున్నారు. పీకే.. ప్ర‌భావం ఎన్నిక‌ల మీద ప‌డింద‌న్న విష‌యాన్ని త‌మ్ముళ్లు ఒప్పుకోవ‌టం అంటే.. ఎన్నిక‌ల ఫ‌లితం మీద వారొక క్లారిటీకి వ‌చ్చేసిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.