Begin typing your search above and press return to search.

తెలంగాణ వాకిట పీకే తుఫాను ? మ‌ళ్లీ అవే ఈక్వేష‌న్లు !

By:  Tupaki Desk   |   3 March 2022 11:48 AM GMT
తెలంగాణ వాకిట పీకే తుఫాను ? మ‌ళ్లీ అవే ఈక్వేష‌న్లు !
X
ప్ర‌స్తుత తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ తుఫాను మొద‌ల‌యింది.తెలంగాణ రాష్ట్ర స‌మితికి ప్ర‌త్యేక వ్యూహ‌క‌ర్త‌గా సీన్ లోకి ప్ర‌శాంత్ కిశోర్ రావ‌డంతో మొత్తం పొలిటిల్ సినేరియోనే మారిపోయింది.ఇంకా ఆయ‌న వ‌చ్చి మూడు నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే ఆయ‌న ప‌ని మొద‌లు పెట్టేశారు.మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర అంటూ ఓ సానుభూతి సంబంధ నాట‌కానికి పీకే తెర‌లేపార‌ని విప‌క్షాలు ఇప్ప‌టికే గ‌గ్గోలు పెడుతున్నాయి.

ఇలాంటి వ్యూహాలు ఎక్క‌డో ఉత్త‌రాదిలో చెల్ల‌వ‌చ్చేమో కానీ తెలంగాణ‌లో చెల్ల‌వు అని బీజేపీ మ‌హిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ అంటున్నారు.వాస్త‌వానికి శ్రీ‌నివాస్ గౌడ్ ఎపిసోడ్ వెనుక ఉన్న‌ది ప్ర‌శాంత్ కిశోరేన‌ని ఆమె ఆరోపిస్తూ వ‌స్తున్నారు.ఈ ఎపిసోడ్ లో జ‌రుగుతున్న వాటితో ఏ విష‌యంతోనూ బీజేపీకి సంబంధం లేద‌నే అంటున్నారు.ఇదంతా పీకే పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ అని ఆమె తేలుస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో గ‌తంలో కూడా ప్ర‌శాంత్ కిశోర్ ఇదే విధంగా సెంటిమెంట్ రాజకీయాలు న‌డిపారన్న‌ది ఓ వాస్త‌వం.ఇదే నిరూపితం కూడా ! ఆయ‌న పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ గా ప‌నిచేసిన ఢిల్లీలో కానీ ప‌శ్చిమ బెంగాల్లో కానీ బీహార్ లోకానీ ఎక్క‌డయినా ఆయ‌న ఓ విధంగా త‌న‌కు బాగా తెలిసిన టెక్నిక్ లో భాగంగా సున్నిత భావోద్వేగాలు రెచ్చ‌గొట్ట‌డం,ఉన్న‌ట్టుండి చెప్పుల దాడి చేయించడం, అదేవిధంగా కాలికి క‌ట్టు క‌ట్టించి ప్రచార స‌భ‌లు నిర్వ‌హించేలా చేయ‌డం వంటివే ఎక్కువ.ఆ విధంగా ఆయ‌న వీల్ ఛైర్ పై మమ‌తా బెంగాల్ లో ప్ర‌చారం చేసేలా చేశారు.అదేవిధంగా కేజ్రీ,నితీశ్ ఆ మాట‌కు వ‌స్తే ఇంకొంద‌రు నేత‌లు కూడా!

ఇంకా చెప్పాలంటే మోడీ కూడా సెంటిమెంట్ రాజ‌కీయాల్లో భాగంగానే ఛాయ్ వాలా తాను అంటూ ఉద్వేగ సంబంధ ప్ర‌సంగాలతో స‌గ‌టు భార‌తీయుడ్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్నారు.ఇవ‌న్నీ మ‌రువ‌క ముందే తెలంగాణ‌లో అడుగిడిన ప్ర‌శాంత్ కిశోర్ త‌న‌దైన శైలిలో రాజ‌కీయం చేయ‌డం మ‌రియు చేయించ‌డం కూడా మొద‌లుపెట్టేశారు.

ఇదే స‌మ‌యంలో డీకే అరుణ లాంటి వారు బెంగాల్ లో నెగ్గుకు వ‌చ్చిన వ్యూహాలు ఇక్క‌డ నెగ్గుకు రావ‌డం క‌ష్ట‌మ‌ని పీకేను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.అదేవిధంగా శ్రీ‌నివాస్ గౌడ్ హ‌త్య చేసేందుకు ప‌న్నిన కుట్ర‌కు త‌మ‌కూ ఎటువంటి సంబంధం లేద‌ని,శ్రీ‌నివాస్ గౌడ్ అవినీతిపై పోరాడుతున్న ఎవ్వ‌రైనా స‌రే తాము ఆశ్ర‌యం ఇస్తామ‌ని అంటున్నారామె.దీంతో తెలంగాణ రాజకీయ ప‌రిణామాలు మ‌రింత‌గా వేడెక్కాయి.సాక్షాత్తూ బీజేపీ నేత‌లే సీన్ లోకి వ‌చ్చి మంత్రి పై పోరాడేవారికి అండ‌గా ఉంటామ‌ని చెబుతుంటే,అస‌లు దీని వెనుక ఉన్న‌దెవ‌ర‌ని? ఒకవేళ ఇది పీకే వ్యూహం అయితే తరువాత ఎవ్వ‌రిని ఆయ‌న టార్గెట్ చేయ‌నున్నార‌ని? కేసీఆర్ డైరెక్ష‌న్లో పీకే ఉన్నారా లేదా పీకే డైరెక్ష‌న్లో కేసీఆర్ యాక్ష‌న్ చేస్తున్నారా అన్న‌ది ఓ పెద్ద డైలమాగానే ఉంది.ఎన్నిక‌ల ముంందు ఉన్న కాలికి క‌ట్లు,పోల్ సీన్ అవ్వ‌గానే, రిజ‌ల్ట్ రాగానే ఎలా మాయం అయిపోతాయో..అదేవిధంగా ఈ కుట్ర రాజ‌కీయం కూడా కొద్ది రోజులు న‌డిచి త‌రువాత సంబంధిత పీకే తుఫాను చెప్పాపెట్ట‌కుండా తెలంగాణ తీరం దాటి పోవ‌డం ఖాయం.