Begin typing your search above and press return to search.

ఆ మేధావి రాజ్య‌స‌భ‌కు వెళ్తున్నారు

By:  Tupaki Desk   |   27 Dec 2015 5:33 AM GMT
ఆ మేధావి రాజ్య‌స‌భ‌కు వెళ్తున్నారు
X
చాయ్ పే చ‌ర్చా...దేశ‌వ్యాప్తంగా అప్ప‌టివ‌ర‌కు జ‌రుగుతున్న సంప్ర‌దాయ‌ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కొత్త దారి ప‌ట్టించిన ప్ర‌చార కార్య‌క్ర‌మం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని వినూత్నంగా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన కొత్త ఆలోచ‌న‌. ఎన్నిక‌ల్లో దుమ్ము రేపే మెజార్టీతో గెలిచిన‌ మోడీ ప్ర‌ధాని అయిన త‌ర్వాత అమెరికా అధ్యక్షుడు బ‌రాక్ ఒబామాతో కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారంటే చాయ్ పే చ‌ర్చ ఎంత క్రేజీ స‌క్సెస్ సాధించిందో అర్థం చేసుకోవ‌చ్చు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో మోడీ తరఫున వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిషోర్ చాయ్ పే చర్చా పేరిట సరికొత్త ప్రచారాస్త్రాన్ని బయటకు తీశారు. తాజాగా కొద్దికాలం క్రితం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ వ్యూహాలకు పదును పెట్టిన ఆయన పర్చా పే చర్చా (పాంఫ్లెట్‌ పై చర్చ) పేరిట మరో కొత్త అస్త్రాన్ని తన అమ్ముల పొదిలో నుంచి తీశారు. ఈ రెండు అస్త్రాలు తాను వ్యూహకర్తగా వ్యవహరించిన ఇద్దరు నేతలకు విజయం సాధించిపెట్టాయి.

సార్వత్రిక ఎన్నికల విజ‌యంతో మెరిసిన ప్రశాంత్ కిషోర్‌ ను బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం- నితీశ్ విజ‌యంతో పొలిటిక‌ల్ స‌ర్కిల్‌ లో పాపుల‌ర్ అయిపోయారు. ఎంత‌గా అంటే త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ సేవలను వినియోగించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి - తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ డిసైడ‌యి ప్ర‌య‌త్నాలు కూడా మొద‌లెట్టారు. జ‌య‌ల‌లిత కూడా ప్ర‌శాంత్ సేవ‌ల కోసం శతథా ప్ర‌యత్నిస్తున్నట్లు స‌మాచారం. అయితే బీహార్‌ కు చెందిన ప్రశాంత్ కిషోర్‌ ను అంత త్వరగా దూరం చేసుకునేందుకు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ సిద్ధంగా లేరు.

త‌న‌కు మ‌ర‌పురాని విజ‌యాన్ని అందించిన ప్రశాంత్‌ ను రాజ్యసభకు పంపేందుకు దాదాపు రంగం సిద్ధం చేశారు. వచ్చే ఏడాది జూలైలో రెండు స్థానాల్లో బరిలోకి దిగనున్న జేడీయూ ఓ స్థానంలో ప్రశాంత్ కిషోర్‌ ను దించేందుకు దాదాపుగా తుది నిర్ణయం తీసుకున్నది. ఈ మేర‌కు పార్టీకి ద‌క్కే రెండు స్థానాల్లో పార్టీ నాయ‌కుడికి ఒక సీటు ప్ర‌శాంత్‌కు మ‌రో సీటు అన్న‌మాట‌. ఎన్నికల వ్యూహాలను రచించి, దేశవ్యాప్త గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ నేరుగా పెద్దల సభలో అడుగుపెడుతున్నారన్న మాట.