Begin typing your search above and press return to search.

ప్రశాంత్ కిశోర్, వైవీ భేటీతో ఏం జ‌ర‌గ‌నుంది?

By:  Tupaki Desk   |   2 July 2017 4:58 AM GMT
ప్రశాంత్ కిశోర్, వైవీ భేటీతో ఏం జ‌ర‌గ‌నుంది?
X
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి 2019 ఎన్నిక‌ల కోసం శ‌ర‌వేగంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవలే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ను అధికారికంగా నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని నాయకులు స్థితిగతులపై ప్రాథ‌మిక‌ అధ్యయనం చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాల్లో పూర్తిస్థాయిలో సర్వేను చేపట్టనున్న‌ట్లు స‌మాచారం. అభ్యర్థుల్లో గెలుపుగుర్రాలపై ప్రశాంత్‌ కిశోర్ పూర్తిస్థాయిలో సర్వేచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎంతమందికి రానున్న ఎన్నికల్లో టిక్కెట్లు దక్కుతాయో అనే చ‌ర్చ వైసీపీలో మొద‌ల‌యింది.

అయితే, ప్రశాంత్ కిశోర్‌ తో తరుచుగా ఒంగోలు పార్లమెంటుసభ్యుడు - జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి భేటీ అవుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. వైఎస్ జ‌గ‌న్ ఇటీవ‌ల ప్ర‌జాక్షేత్రంలో బిజీ అవుతున్న నేప‌థ్యంలో ప్ర‌శాంత్ కిశోర్‌ తో పార్టీ ప‌ర‌మైన వ్య‌వ‌హారాల‌ను వైవీ చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ రాజకీయంగా ఏవిధంగా బలపడాలో అన్న అంశాలపై చర్చిస్తున్నట్లు స‌మాచారం. అందులో భాగంగా వారిద్దరూ హైదరాబాద్ నుండి విజయవాడకు విచ్చేసి రాష్ట్ర పార్టీ కార్యాలయ నిర్మాణం, పార్టీ నిర్మాణం లాంటి పలు కీలకమైన అంశాలపై చర్చించినట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. మొత్తం మీద పార్టీ బలాబలాలపై ఎంపీ వైవి - ప్రచార వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ లు తరుచుగా సమావేశమ‌వుతూ రానున్న ఎన్నికల్లో పార్టీని ఏవిధంగా గెలిపించుకోవాల‌నే అంశాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్ర‌మంలోనే వైసీపీకి బాగా ప‌ట్టున్న ప్ర‌కాశం జిల్లాపై ఎంపీ నుంచి కూడా ప్రశాంత్‌ కిశోర్ సమగ్రమైన నివేదిక తీసుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా తూర్పుప్రకాశం కంటే పశ్చిమప్రకాశంలోనే వైసీపీ బాగుందన్న అభిప్రాయంలో రాష్ట్ర పార్టీ ఉన్నట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/