Begin typing your search above and press return to search.

బాబుకు ప్రశాంత్ కిషోర్ ఆన్సర్.. సూటిగా - సున్నితంగా!

By:  Tupaki Desk   |   19 March 2019 11:16 AM GMT
బాబుకు ప్రశాంత్ కిషోర్ ఆన్సర్.. సూటిగా - సున్నితంగా!
X
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో పూర్తి అహసనంగా వ్యవహరిస్తూ ఉన్న వైనం స్పష్టం అవుతూ ఉంది. ఐదేళ్ల అధికారం తర్వాత బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నారు. ఆఖరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పని చేసే వాళ్లను వ్యక్తిగతంగా నిందించడానికి, వారిపై అర్థం లేని ఆరోపణలు చేయడానికి కూడా బాబు వెనుకాడటం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి అలా మాట్లాడొచ్చా? అనే విషయం గురించి చంద్రబాబే ఆలోచించుకోవాలని పరిశీలకులు అంటున్నారు.

అలా చంద్రబాబు నాయుడు తీవ్రమైన మాటలతో పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ మీద కూడా విరుచుకుపడిపోయారు. ప్రశాంత్ కిషోర్ అలియస్ పీకే జగన్ కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ పొలిటికల్ స్ట్రాటజిస్టుగా ఉన్నారు పీకే. గ్రౌండ్ వర్క్ నుంచి స్ట్రాటజీల విషయంలో పీకే జగన్ కు తన సలహాలు ఇస్తూ ఉన్నారు. ఇది వరకూ నరేంద్రమోడీకి స్ట్రాటజిస్టుగా వ్యవహరించిన పీకే దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ క్రమంలో జగన్ ఆయనను నియమించుకున్నారు.

వాళ్ల పనేదో వాళ్లు చేస్తున్నారు. ఏ రాజకీయ నేతకు అయినా తన సలహాలను అమ్ముకోవడం పీకే మార్కెటింగ్. ఇదో నయా ప్రొఫెషనల్ కెరీర్ లాంటిది. ఆయన పని ఆయన చేసుకొంటున్నారు. ఒకవేళ ఇదే పీకేను చంద్రబాబు నాయుడు హయర్ చేసి ఉంటే.. ఆయన కోసం పని చేసే వారేనమో. జగన్ ముందుగా మేల్కొన్నాడు, అప్పుడే పీకేతో ఒప్పందం చేసుకున్నాడు.

ఇలాంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ జగన్ తరఫున పని చేస్తూ ఉన్నారు. ఈ పరిణామం చంద్రబాబులో బాగా అసహనాన్ని కలగిస్తున్నట్టుగా ఉంది. అందుకే చాన్నాళ్లుగా పీకే మీద విరుచుకుపడుతూ ఉన్నారు. ‘పీకే ఓట్లను తొలగిస్తున్నాడు.. బీహారీ గజదొంగ..’అంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తూ ఉన్నారు. అయినా ఓట్లను తొలగించే శక్తి పీకే కు ఉంటుందా? అనేది వేరే వాదన.

అయితే ‘బీహారీ గజదొంగ’అంటూ చంద్రబాబు నాయుడు రోజూ తిడుతున్నారు. ఇన్ని రోజులూ ఈ అంశం మీద పీకే స్పందించలేదు కానీ, తాజాగా స్పందించారు. తన మీద ఏపీ సీఎం చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ రియాక్ట్ అయ్యారు. సూటిగా - సున్నితంగా చంద్రబాబుకు సమాధానం ఇచ్చారు పీకే.

‘ఓటమి ఎదురవ్వడం ఖాయం అనే సందర్భంలో రాజకీయ నేతలు ఇలా మాట్లాడటం సహజమే - బాబు ప్రస్తుత పరిస్థితి అదే. అందుకే అలాంటి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు.’ అని పీకే పేర్కొన్నారు. అంతే కాదు..బాబుకు ఒక సున్నితమైన సూచన కూడా చేశారు. ‘సర్ జీ… మీరు బిహార్ ను అవమానించేలా మాట్లాడుతున్నారు. బిహార్ విషయంలో మీ తీరు సరి కాదు. ఈ పని చేయడానికన్నా.. ఏపీ ప్రజలు మీకే ఓటేసేలా పని చేసుకోవడం మేలేమో..’ అన్నట్టుగా ఒక ఘాటైన సూచన చేశారు. మరి దీనిపై బాబు ఎలా రియాక్ట్ అవుతారో!