Begin typing your search above and press return to search.
జగన్ కోసమే ప్రశాంత్ కిశోర్
By: Tupaki Desk | 10 Sept 2018 11:27 AM IST2019 ఎన్నికల్లో తాను వైసీపీ కోసం మాత్రమే పనిచేస్తున్నానని వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పారు. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఆయన మాట్లాడుతూ... 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం తప్ప ఇంకెవరి తరపునా ప్రచారం చేయడం లేదని చెప్పారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో నడుస్తున్న తన సంస్థను సమర్ధులైన వారికి అప్పగించే పనిలో ఉన్నట్లు ప్రశాంత్ కిశోర్ తెలిపారు.
2014లో మోడీ తరపున భారీ స్థాయిలో ప్రచారం చేసి గెలుపులో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్… 2015 మార్చి వరకు ప్రధాని కార్యాలయంతో టచ్ లో ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వేరు పడ్డారు. గత ఏడాది తన తల్లికి అనారోగ్యంగా ఉన్నదని తెలుసుకున్నమోడీ.. తనని పిలిపించి మాట్లాడారని…. అప్పటి నుంచి మోడీతో అప్పుడప్పుడూ మాట్లాడుతున్నట్లు ప్రశాంత్ కిశోర్ తెలిపారు. అయితే... వచ్చే ఎన్నికల్లో తిరిగి మోడీతో కలిసి పనిచేసే అవకాశం లేదని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.
2014 లోక్ సభ ఎన్నికల్లో మోడీ తరపున… ఆ తర్వాత బీహార్ లో నితీష్ కుమార్ తరపున ఎన్నికల వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిశోర్ ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ తో కలిసి పనిచేశారు. అక్కడ చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి వ్యూహకర్తగా సేవలందిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి సూచనలు - సలహాలు అందిస్తున్నారు. గతంలో తాను మాటిచ్చిన కారణంగా వైసీపీతో పనిచేస్తున్నానని చెప్పారు.