Begin typing your search above and press return to search.

పక్కా కాంగ్రెస్ వాది..ఆర్ ఎస్ ఎస్ కు మద్దతు ఎలా?

By:  Tupaki Desk   |   1 Sept 2020 9:30 AM IST
పక్కా కాంగ్రెస్ వాది..ఆర్ ఎస్ ఎస్ కు మద్దతు ఎలా?
X
దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పక్కా కాంగ్రెస్ వాదిగా పేరుగాంచారు. ఆయన పుట్టుక.. గిట్టుక కాంగ్రెస్ లోనే సాగింది. అందులోనే అత్యున్నత పదవులు అనుభవించాడు. కానీ రాష్ట్రపతి పదవి చేపట్టాక ప్రణబ్ ముఖర్జీలో భారీ మార్పులు వచ్చాయని అంటుంటారు.

రాష్ట్రపతి అయ్యాక ఆయన బీజేపీకి దగ్గరయ్యారు. మోడీకి సన్నిహితుడయ్యాడు. ఈ క్రమంలోనే తన కాంగ్రెస్ భావజాలాన్ని త్యజించాడు. మోడీకి సహకరించారు. బీజేపీ భావజాలాన్ని గౌరవించారు. అపర కాంగ్రెస్ వాది ఎప్పుడూ రాష్ట్రీయ స్వయం సహాయక్ సంఘ్ ను ద్వేషిస్తుంటారు.

కానీ రాష్ట్రపతిగా బాధ్యతలు ముగిశాక ఆర్ఎస్ఎస్ నాగపూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రణబ్ పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి వేడుకను పంచుకున్నారు.

ప్రణబ్ చర్య కాంగ్రెస్ నేతలకు మింగుడు పడలేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంత రచ్చ చేసినా ప్రణబ్ వెనక్కు తగ్గలేదు. ఈ మీటింగ్ లో పాల్గొని తాను పక్షపాతం లేని రాజకీయవేత్తను అని నిరూపించుకున్నారు.

రాష్ట్రపతి అయినప్పటి నుంచి తాను అన్ని పార్టీలకు చెందినవాడినని చెప్పకనే చెప్పారు. రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయాక కూడా కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పక్షాలను ఒకే రకంగా ప్రణబ్ చూడడం విశేషం.