Begin typing your search above and press return to search.

ఆత్మకథలో ప్రణబ్ సంచలనం.. సోనియాపై కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   12 Dec 2020 4:35 AM GMT
ఆత్మకథలో ప్రణబ్ సంచలనం.. సోనియాపై కీలక వ్యాఖ్యలు
X
కాంగ్రెస్ వైఫ్యలాల వెనుక అసలేం జరిగిందన్న విషయంపై కూసింత క్లారిటీ రానుందా? అంటే అవునని చెప్పాలి. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లభించనుంది. ‘‘ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ ఆత్మకథను రూపా పబ్లిషర్స్ జనవరిలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకానికి సంబంధించిన కొంత సమాచారాన్ని వారు వెల్లడించారు.

అందులో కాంగ్రెస్ పార్టీ వైఫల్యంతో పాటు.. పార్టీ అధినాయకత్వం చేసిన తప్పులను ఆయన ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాను రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యవహారాల్ని సమర్థవంతంగా నిర్వహించటంలో సోనియాగాంధీ ఫెయిల్ అయినట్లుగా పేర్కొంటూ.. పార్టీ పతకానికి కారణాల్ని ఆయన ప్రస్తావించటం గమనార్హం.

కోవిడ్ కారణంగా ఈ జులై 31న ప్రణబ్ ముఖర్జీ మరణించారు. ఆయన ఆత్మకథను రూపా పబ్లిఫర్స్ ప్రచురించనున్నారు. 2004లో తాను ప్రధాని పదవిని చేపట్టి ఉంటే.. 2014లో పార్టీ ఘోర ఓటమిని మూటకట్టుకొని ఉండకపోయేదని పార్టీలో చాలామంది అనే వారని.. కానీ తాను ఆ అభిప్రాయాన్ని ఒప్పుకోనని పేర్కొన్నారు. ‘‘పార్టీ వ్యవహారాల్ని చక్కదిద్దటంలో సోనియా విఫలమయ్యారు. హౌస్ కు మన్మోహన్ దూరంగా ఉండటంతో ఎంపీలు ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశాన్నికోల్పోయారు. కూటమిని రక్షించుకోవటంలోనే మన్మోహన్ మునిగిపోయేవారు’’ అని పేర్కొన్నారు.

ఈ పుస్తకంలో పేర్కొన్న కొన్ని అంశాలే ఇంత సంచలనంగా ఉంటే.. ఈ ఆత్మకథ విడుదలయ్యాక మరిన్ని సంచలనాలకు.. రాజకీయ చర్చకు పుస్తకం కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.మరేం జరుగుతుందో చూడాలి.