Begin typing your search above and press return to search.

ఉపేంద్ర‌కు 'సేన' సంపూర్ణ మ‌ద్ద‌తు

By:  Tupaki Desk   |   22 Aug 2017 9:23 AM GMT
ఉపేంద్ర‌కు సేన సంపూర్ణ మ‌ద్ద‌తు
X
ద‌క్షిణాదిన ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా సినీ ప్ర‌ముఖులు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శాండిల్ వుడ్ స్టార్ ఉపేంద్ర రాజ‌కీయ పార్టీ పెట్టాల‌ని నిర్ణ‌యించుకోవ‌టం.. ఆయ‌న ప్ర‌క‌ట‌న‌పై క‌న్న‌ట నాట అనూహ్య మ‌ద్ద‌తు రావ‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే..ఉపేంద్రకు శ్రీరామ సేన సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌టం కొత్త ప‌రిణామంగా మారింది.

బెంగ‌ళూరులోని ఉపేంద్ర ఇంటికి శ్రీరామ‌సేన వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ప్ర‌మోద్ ముతాలిక్ త‌దిత‌రులు వెళ్ల‌ట‌మే కాదు..దాదాపు రెండు గంట‌ల పైన రాజ‌కీయ చ‌ర్చ వారి మ‌ధ్య సాగిన‌ట్లుగా తెలుస్తోంది. ద‌క్షిణ క‌ర్ణాట‌క జిల్లాల్లో బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉన్న శ్రీరామ‌సేన.. ఉపేంద్ర‌కు మ‌ద్ద‌తు ఇస్తాన‌ని చెప్ప‌టం రాజ‌కీయంగా స‌రికొత్త ప‌రిణామంగా చెబుతున్నారు.

ప్రజాకీయం పేరిట రాజ‌కీయ పార్టీ పెట్టిన ఉపేంద్ర‌కు శ్రీరామ‌సేన వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు కీల‌క స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. ఆయ‌న‌కు ఎలాంటి స‌ల‌హాలు ఇచ్చిన విష‌యాన్ని మాత్రం ఇరువురు బ‌య‌ట‌పెట్ట‌కుండా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఏమైనా రాజ‌కీయంగా ఈ భేటీ అంద‌రి దృష్టిని విశేషంగా ఆక‌ర్షిస్తోంది.