Begin typing your search above and press return to search.

సెనేట్ కి ఎంపికైన తొలి భారత సంతతి మహిళ!

By:  Tupaki Desk   |   9 Nov 2016 11:13 AM GMT
సెనేట్ కి ఎంపికైన తొలి భారత సంతతి మహిళ!
X
వాషింగ్టన్‌ నుంచి డెమోక్రటిక్‌ పార్టీ తరఫున సెనెట‌ర్ పదవికి పోటీచేసిన భారత సంతతికి చెందిన ప్రమీల జయపాల్ విజ‌యం సాధించారు. అమెరికా కాంగ్రెస్‌ లో యూఎస్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ కు ఆమె ఎన్నిక‌య్యారు. దీంతో అమెరికా ప్రతినిధుల సభ​కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికా మహిళగా ఆమె ఈ ఘనత సాధించారు. జిమ్‌ మెక్‌ డెర్మాట్‌ స్థానంలో సభలో ఆమె త్వ‌ర‌లోనే బాధ్యతలు స్వీక‌రించ‌నున్నారు. ఈ సమయంలో స‌భ‌లో 37ఏళ్లు పనిచేసిన జిమ్‌ మెక్‌ డెర్మాట్ రిటైర్ కానున్నారు. తాజాగా జరిగిన అమెరికాలోని ఎన్నికల్లో ప్రమీల జయపాల్ 57శాతం ఓట్లు సాధించగా, తన ప్రత్యర్ధి బ్రాడి వాకిన్ షా 44శాతం ఓట్లు సాధించారు. దీంతో తన ప్రత్యర్ధిపై 14ఓట్ల శాతంతో ఈమె గెలుపొందారు.

కాగా, ప్రమీల జ‌య‌పాల్ తమిళనాడు రాజ‌ధాని చెన్నైలో జ‌న్మించారు. అయితే అయిదేళ్ల వయసు ఉన్న‌ప్పుడు ఆమె ఇండోనేషియాకు వెళ్లారు. అనంత‌రం అక్క‌డి నుంచి సింగపూర్ - తర్వాత అమెరికాకు వెళ్లి అక్క‌డే నివ‌సిస్తున్నారు. గతంలో 1995 ప్రాంతంలో భారత్‌ కు వచ్చిన ఆమె ఇక్క‌డ కొన్నాళ్లు గ‌డిపి తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. తమ ప్రాంతంలో వలసదారుల కోసం చేసిన కృషికి గాను ఆమెను శ్వేత‌సౌధం 2012లో "ఛాంపియన్‌ ఆఫ్‌ ఛేంజ్‌" అవార్డుతో స‌త్క‌రించింది. తాను ఈ ఎన్నికల్లో గెలుపొందితే ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తాన‌ని ప్రమీల జ‌య‌పాల్ గ‌తంలో ప‌లు హామీలు ఇచ్చారు. వాటిలో.. ట్యూషన్‌ ఫీజు లేని కమ్యూనిటీ కాలేజీలు - ప్రాథమిక విద్యకు ప్రత్యేక నిధులు అనే హామీలు ముఖ్య‌మైన‌వి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/