Begin typing your search above and press return to search.

జగన్ ను హతమార్చే కుట్ర.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   11 Dec 2021 5:13 PM IST
జగన్ ను హతమార్చే కుట్ర.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X
వైసీపీకి చెందిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హత్యకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు ఈ కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయనను హత్య చేసైనా అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తోందని అన్నారు.

జగన్ గాల్లోనే కలిసిపోతారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారని.. సీఎంను జైలుకు పంపేందుకు టీడీపీ కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఇక మరో కమ్మ సంఘం నేత మల్లాది వాసు సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వంశీ, అంబటిలను చంపితే రూ.50 లక్షలు ఇస్తానని కమ్మ సంఘం నేత ప్రకటన చేశారు. ఎక్కడో చెబితే అనంతపురంలో ఫ్లెక్సీలు కడుతున్నారని.. ఇదే టీడీపీ విధానమా? అని దుయ్యబట్టారు.

ఈ ఆరోపణలు నిజం అని.. అందుకే చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ సహా టీడీపీ నేతలెవరూ ఎందుకు ఖండించడం లేదని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. హింసా రాజకీయాలకు కేరాఫ్ గా టీడీపీ, స్కాంలకు కేరాఫ్ గా చంద్రబాబు మారారని ఆరోపించారు.

చంద్రబాబు పాలనలో వేల కోట్ల ప్రజాధనం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లిపోయిందని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఇది అబద్ధమైతే సీఐడీ విచారణకు ఆ పార్టీ నేతలు ఎందుకు అడ్డుపడుతున్నారో వివరించాలన్నారు. జగన్ ను హత్య చేసైనా అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తోందని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.