Begin typing your search above and press return to search.

మోడీ 'చీతాల'పై దిమ్మదిరిగే సెటైర్ వేసిన ప్రకాష్ రాజ్

By:  Tupaki Desk   |   18 Sept 2022 11:24 AM IST
మోడీ చీతాలపై దిమ్మదిరిగే సెటైర్ వేసిన ప్రకాష్ రాజ్
X
దేశంలో అంతరించిపోయిన చీతాలను నమీబియా దేశం నుంచి తీసుకొచ్చి మరీ తన బర్త్ డే సందర్భంగా మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో శనివారం విడుదల చేశారు.దీనికి బీజేపీ భారీ ప్రచారం కల్పించింది. మోడీ చర్యలపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరికీ దీనిలో మంచి కనపడితే.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు మాత్రం మోడీ వైఫల్యాలు కనిపించాయి.

ప్రకాష్ రాజ్ శనివారం రాత్రి సోషల్ మీడియాలో వేసిన సెటైర్ మోడీకి దిమ్మదిరిగిపోయేలా ఉంది. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'ఈ చీతాలను ఎప్పుడు తీసుకొస్తారు' అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ లో మోడీని ప్రశ్నించారు.

తాను చెప్పే చీతాలు ఇవేనంటూ 'విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీల' ఫొటోలను ఆయన తన ట్వీట్ కు జత చేశారు. అడవుల్లో తిరిగే చీతాలను రప్పించారు. మరి బ్యాంకుల నుంచి వేల కోట్లు రుణాలు తీసుకొని ప్రజలను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వారిని ఎప్పుడు రప్పిస్తారు? అనే అర్థం వచ్చేలా ప్రకాష్ రాజ్ ఆ పోస్ట్ ను పెట్టారు. 'జస్ట్ ఆస్కింగ్' పేరిట బీజేపీ విధానాలను అది నుంచి విమర్శిస్తూ వూస్తున్న ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

విజయ్ మాల్యా, మేహుల్ చోక్సీ, నీరవ్ మోడీ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులను ఎదుర్కొంటున్నారు. వారిపై సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను అధికారులు కేసులు నమోదు చేశారు.

విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇంగ్లండ్ లో నివసిస్తున్నారు. మెహుల్ చోక్సీ, అంటిగ్వా అండ్ బార్బుడాలో ఉంటున్నారు. వారిని స్వదేశానికి రప్పించడానికి సీబీఐ, ఈడీ చేస్తోన్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. దీంతో మోడీ కార్పొరేట్లకు దోచిపెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.