Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాట తప్పితే నిరాహార దీక్ష చేస్తా..

By:  Tupaki Desk   |   30 Nov 2018 5:31 AM GMT
కేసీఆర్ మాట తప్పితే నిరాహార దీక్ష చేస్తా..
X
తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలందరూ కులం, మత, ప్రాంతం, స్వార్థానికి అతీతంగా ఆలోచించి తెలంగాణ ప్రజల కోసం పాటు పడే పార్టీని గెలిపించాలని కోరారు. మహాకూటమిలోని నాలుగు పార్టీల కంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాలను ఎక్కువగా కాపాడుతుందని తాను నమ్ముతున్నట్టు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. కేసీఆర్ తో తాను ప్రగతి భవన్ లో ఒక ఫుల్ డే ఉన్నానని.. పంచాయతీ రాజ్ బిల్లును ఆయన రూపొందిస్తే చదివానని.. అది తెలంగాణ పల్లెల దశను మారుస్తుందన్నారు. కానీ అది బిల్లుగా రాలేదన్నారు.రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చించామని.. కేసీఆర్ ఎంతో విజన్ ఉందని స్పష్టం చేశారు.

ఇక తెలంగాణ గురించి ఇంచు ఇంచు కేసీఆర్ కు తెలుసు అని.. అలాంటి మట్టిమనిషిని తాను ఎక్కబి చూడలేదని ప్రకాష్ రాజ్ అన్నారు. కేసీఆర్ ముక్కుసూటి తనం తనకు చాలా ఇష్టమని.. ఆయన పాలనలో కొంచెం కఠినంగా.. సాఫ్ట్ గా ఎందుకు వెళతాడో తెలిసిందన్నారు. తెలంగాణ బాగు కోసం చేస్తాడే కానీ ఆయన ఎవరి మెప్పు పొందడానికో కాదన్నారు.

బీజేపీపై ప్రకాష్ రాజ్ నిప్పులు చెరిగారు. జీఎస్టీ, నోట్ల రద్దు, ఎఫ్డీఐ లాంటి తప్పిదాలతో బీజేపీ దేశాన్ని వెనక్కి తీసుకెళ్లిందని మండిపడ్డారు. ఎన్నో అసంబద్ద నిర్ణయాలు తీసుకున్న మోడీ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమన్నారు. బీజేపీని ఎన్నుకోవడం మన ఖర్మ అని అంటారు..

కాంగ్రెస్ తో టీడీపీ కలవడాన్ని కుట్రగా ప్రకాష్ రాజ్ అభివర్ణించారు. చంద్రబాబు కాంగ్రెస్ తో కలవక పోతే బీజేపీ చేతిలో ఖతం కావడం ఖాయమని.. అందుకే ఆయన తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలుస్తున్నాడని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.

తెలంగాణలో తనకు కేసీఆర్ తప్ప వేరే లీడర్ కనిపించడం లేదని.. కాంగ్రెస్ లో ఒక్క లీడర్ పేరు చెప్పాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆడిన మాట తప్పరని.. మాట తప్పితే తానే నిరాహార దీక్ష చేస్తానని.. మాట తప్పితే నిలదీస్తానని చెప్పుకొచ్చారు. బీజేపీతో అస్సలు కలువనని చెప్పిన కేసీఆర్ ఒకవేళ కలిస్తే నిలదీస్తానని స్పష్టం చేశారు.