Begin typing your search above and press return to search.
మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా:ప్రకాష్ రాజ్ ప్రశ్న
By: Tupaki Desk | 5 Feb 2018 2:17 PM ISTవిలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కేంద్రంపై మాటల తూటాల్ని పేలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య జరిగింది. ఆ హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ విలక్షణ నటుడు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ పీఎం మోడీ తనకన్నా పెద్దనటుడంటూ కామెంట్స్ చేశారు. అంతేకాదు గౌరీ లంకేష్ హత్యకేసుల్లో నిందితుల్ని అరెస్ట్ చేయకపోవడం, జరుగుతున్న సంఘటనలపై మోడీ మౌనం నన్ను కలవరపెడుతోంది. ప్రజాస్వామ్యదేశంలో బాధ్యయుతమైన పౌరుడిగా స్పందిచానని తన వ్యాఖ్యల్ని సమర్ధించుకున్నారు. అప్పట్లో ప్రకాష్ వ్యాఖ్యలు వివాదమయ్యాయి.
ఏప్రిల్ లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ "నవకర్నాటక నిర్మాణ పరివర్తన" యాత్ర పేరిట పీఎం మోడీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ బీజేపీ కర్నాటకను కొత్తగా మారుస్తుంది. రైతుల జీవితాల్ని మెరుగుపరిచి మౌలిక సదుపాయాల్ని కల్పిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి కర్నాటకలో ఏడు లక్షల ఇళ్లు కరెంట్ లేకుండా ఉన్నాయంటూ కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోశారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బెంగళూరుకు సబర్బన్ రైల్వే నెట్ వర్క కింద 15 లక్షల మంది ప్రయాణీకులకు ప్రయోజనం కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర నిధుల్ని దారి మళ్లించి అవినీతికి పాల్పడుతోందని అన్నారు. కర్ణాటక అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, బెంగళూరు మెట్రోకు ర.17 వేల కోట్లు కేటాయించామన్నారు. కర్ణాటక రూపురేఖలు మార్చేది బిజెపి మాత్రమేనని గుర్తు చేశారు.
అయితే ఈ ర్యాలీ పై ప్రకాష్ రాజ్ పంచ్ లేశారు. గత ఎన్నికల హామీల్ని గుర్తు చేసిన ఈ విలక్షణ నటుడు 2014లో అమ్మిన ప్రామిస్ టూత్ పేస్ట్ రైతులు - నిరుద్యోగ యువత ముఖాలపై నవ్వులు పూయించడంలో విఫలమైంద’ ని అన్నారు. బెంగళూరు ర్యాలీలో అమ్మిన ప్రామిస్ టూత్‌పేస్ట్ ఆ నవ్వులను తీసుకొస్తాయని మీరు నమ్ముతున్నారా..? అంటూ తనదైన శైలిలో ట్విట్ చేశారు.